ఎన్నికల హామీల పట్ల అప్రమత్తం గా ఉండాలి

గత ఐదేళ్ల పాలనలో ఇచ్చిన హామీల మేరకు చెయ్యాల్సిన పనులు చేయకుండా ఎన్నికలు దగ్గర పడటం తో నయవంచనకు తేరా లేపటం మళ్ళి బాబే రావాలంటూ సాగిస్తున్న ప్రచారం పట్ల హడావిడి హామీలపట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోమవారం జరిగిన ఏపీ మంత్రి వర్గ సమావేశంలో కాపులకు 5% రిజర్వేషన్, ఆటోలకుపన్ను మినహాయింపు , డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ కింద ఒకొక్కరి పది వేలు, ప్రభుత్వ  ఉద్యగులకు డి ఏ, అగ్రిగోల్డ్ భాదితులకు నిధులు కేటాయింపు వంటి హామీలు ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో కూడా ఇలాగె రాష్ట్ర ప్రజానీకం పై హామీల వర్షం కురిపించారు “జాబ్ కావాలంటే బాబు రావాలి”  ‘ఆయన వస్తున్నారు,  రైతన్నలకు రుణమాఫీ “ఇంటింటికి ఉద్యోగం” ఉద్యోగం రానిచో  నిరుద్యోగ భృతి, ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఒక్కటేమిటి సమాజం లో ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూరుస్తామంటూ గత మేనిపెస్టోలో హామీల వర్షం కురిపించారు ప్రజలు ఆయన మాటలు నమ్మి ఓటేసి గెలిపించారు అధికార పీఠం ఎక్కిన చంద్రబాబు ఈ నాలుగున్నర ఏళ్లలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చలేకపోయారు. రైతు రుణమాఫీ కి విడతలవారి చిక్కులతో చుక్కలు  చుపించారు డ్వాక్రా మహిళలను ఇబ్బంది పాలు చేసి ఇప్పుడు ఒకొక్కరికి పది వేలు ఇస్తామంటూ కాబినెట్ లో తీర్మానం చేయటం ఖచ్చితం గా ఎన్నికల జిమ్మిక్కే, రైతులకు బ్యాంకు లలో అప్పు పుట్టని దుస్థితికి తీసుకువచ్చిన పాపం కూడా చెంద్రబాబుదే. వయోజనులను  ఆదుకొనే ఉద్దేశ్యమే ఉంటె ఈ నాలుగేళ్లు మిన్నకుండి ఎలక్షన్ ముందు పెన్షన్ రెట్టింపు చేయడం ఎన్నికల  జిమ్మిక్కు కాక మరేమిటి ? ఇంటికొక ఉద్యోగం లేదంటే నిరుద్యోగ  భృతి రెండు వేలు ఇస్తామంటూ ఇచ్చిన హామీని గాలికొదిలేసి ఇప్పుడు హడావిడిగా అరకొరగా ఇచ్చి మమ అనిపించుకొంటున్నారు  ఇలాంటి కల్లబొల్లి కబుర్ల హామీల మాయలో పడ కూండా మళ్ళి ఆయనే రావాలంటూ పసుపు దండు సాగిస్తున్న ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి . ప్రజా సమస్యలపై చట్టసభలలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతి పక్షం అసెంబ్లీ కి వెళ్లకుండా రోడ్డున పడి తిరుగుతూ నవరత్నాలతో నవలోకం తీసుకు వస్తామంటూ హామీలు గుప్పిస్తుంది, అధికారామె లక్ష్యం గా హామీలు కురిపించే పార్టీ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండీ ప్రత్యాన్మాయ రాజకీయ పార్టీ లను ఆదరించి వలసిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published.