‘కరచాలనం వద్దు.. నమస్కారాలు ముద్దు’ మంత్రులు, ఎమ్మెల్యేలు

కరోనా వైరస్ ప్రభావం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో స్పష్టంగా కనిపించింది. ఇప్పటికే హైదరాబాద్లో ఇద్దరు వ్యాధిగ్రస్తులను గుర్తించడంతో పాటు పలువరుని గాంధృలో చికిత్సల నిమిత్తం తరలించడంతో నగరంలో కరోనా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శాసనసభ్యులు కూడా జాగ్రత్తలు పాటిస్తుండటం కొసమెరుపు.
శుక్రవారం ప్రారంభమయిన బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీ ఆవరణలో ఒకరినొకరు తాకేందుకు కానీ, కరచాలనాలను చేసేందుకు కానీ ఇష్టపడలేదు. దీనికి బదులు పరస్పరం నమస్కారాలు చేస్తూ కనిపించారు. ‘కరచాలనం వద్దు.. నమస్కారాలు ముద్దు’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు అనుకోవడం ఆసక్తిదాయకంగా మారింది. మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ని సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు కరచలనం చేసేందుకు చేతులు ముందుకు చాపగా , నమస్కారం అంటూ చేతులు జోడించి ముందుకెళ్లిపోవటం చూస్తుంటే కరోనా ఎఫెక్ట్ సభ్యుల మీద ఎంత పడిందో అర్ధమవుతోంది.