మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా పోస్టర్ సినిమా మోషన్ పోస్టర్ విడుదల.


శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి యం ఆర్. (TMR) దర్శకుడిగా, విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షిత సోనావనే హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా  “పోస్టర్”.  సినిమా మోషన్ పోస్టర్ ను   మంత్రి హరీష్ రావు గారు విడుదల చేసారు. అనంతరం హరీష్ రావు గారు మాట్లాడుతూ   “సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలంటే  అన్ని సినిమాలు హిట్టు అవ్వాలి. ఈ పోస్టర్ అనే సినిమా కూడా హిట్ అవ్వాలని ఈ సినిమా టీమ్ సభ్యులకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను”   అని అన్నారు.   డైరెక్టర్ టి యం ఆర్ మాట్లాడుతూ   “మా సినిమా మోషన్ పోస్టర్ ను గౌరవనీయులు మరియు మంత్రివర్యులు శ్రీ టి హరీష్ రావు గారు  విడుదల చేయడం  నాకు చాలా సంతోషంగా ఉంది, మా పట్ల ఆయన సహకారానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను, అంతేకాక  ఈ సినిమా టీజర్ అతి త్వరలో మీ ముందుకి వస్తుంది, మీరంతా తప్పక చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను”   అని అన్నారు. ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా శివాజీ రాజా, మధుమణి, కాశి విశ్వనాధ్, రామరాజు, అరుణ్ బాబు, స్వప్నిక, జగదీశ్వరి, కీర్తికా, శంకర్ గణేష్, మల్లికార్జున్, అజయ్..,  వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు మాటలు నివాస్, సంగీతం శాండీ అద్దంకి, కెమెరా రాహుల్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్. టి శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి , ఐ జి రెడ్డి మరియు మహిపాల్ రెడ్డి లు కలసి నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.