విద్యుజ‌మాల్ హీరోగా సంక‌ల్ప్ రెడ్డి తాజా చిత్రం… `ఘాజీ`, `అంత‌రిక్షం` సినిమాల‌తో  అంద‌రి దృష్ఠిని ఆక‌ర్షించిన సంక‌ల్ప్ రెడ్డి  తాజాగా మ‌రికొన్ని నిజ ఘ‌ట‌న‌ల  ఆధారంగా  రాసుకున్న క‌థ‌ను  భారీ యాక్ష‌న్ సినిమా గా తెర‌కెక్కిస్తున్నాడు.   ఈ  సినిమాను తొలుత  హిందీలో తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఈ చిత్రం కోసం క‌త్తి, శ‌క్తి, సికింద‌ర్ వంటి చిత్రాల్లో న‌టించిన విద్యుజ‌మాల్ ని హీరోగా ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం విద్యుజ‌మాల్ కమాండ‌ర్2 తో బిజీగా ఉన్నాడు. ఇది పూర్త‌య్యాక  ఈ సినిమాలో న‌టిస్తాడు. 

 అండ‌ర్ వాట‌ర్‌లో ఉండే స‌బ్‌మెరైన్ మీద  షార్ట్ ఫిలిం చేయాల‌నుకుని హైద‌రాబాద్ వ‌చ్చిన సంకల్ప్ చెప్పిన క‌థ విన్న‌ రానా ద‌గ్గుబాటికి, నిర్మాత పివిపి ల‌కు న‌చ్చ‌డంతో  ద‌ర్శ‌కుడిగా మారి  `ఘాజీ` పేరుతో తెర‌కెక్కించాడు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సాధించింది. త‌దుప‌రి అంత‌రిక్ష్య నేప‌థ్యంలో తెర‌కెక్కిన అంత‌రిక్ష్యం 9000 కెఎంపిహెచ్ బాక్సాఫీస్ ముందు చ‌తికిల పడింది. ద్వితీయ విఘ్నం దాట‌లేక‌పోయిన సంక‌ల్ప్ తాజాగా చేస్తున్న ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు విజ‌య‌వంత‌మ‌వుతుందో చూడాలి.   

Leave a Reply

Your email address will not be published.