ప‌వ‌న్ పాల్గొనే రెండో షెడ్యూల్ మొదలుకానుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూ, 26వ చిత్రం గా  బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’ రీమేక్  చేస్తున్నారు.  వేణు శ్రీరాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు, బోణి కపూర్ నిర్మాతలు. ఇప్పటికే సినిమా తొలి  షెడ్యూల్ పూర్తికాగా  మరికొద్ది రోజుల్లో ప‌వ‌న్ పాల్గొనే రెండో షెడ్యూల్ మొదలుకానుందని స‌మాచారం.
కాగా  ఈ చిత్రానికి  ముందు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వినిపించారా…  నిర్మాత దిల్ రాజు.. ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారంటై వార్త‌లొచ్చిన నేప‌థ్యంలో వ‌కీల్ సాబ్ టైటిల్ ప‌వ‌న్‌కి న‌చ్చ‌లేద‌ని , త‌న‌ జ్యోతిష్యులు చెప్పిన‌ట్టు  ‘లాయర్ సాబ్’ అని టైటిల్ పెడితేనే కలిసొస్తుందని  పవన్ స్ప‌ష్టం చేయ‌టంతో  ఇద్ద‌రిమ‌ధ్య ఇప్ప‌టికీ అవ‌గాహ‌న రాక ద‌ర్శ‌కుడు  తెగ ఇబ్బంది ప‌డుతున్నాడ‌ట‌. కాగా ఈ చిత్రానికి మ‌రో టైటిల్ కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published.