అక్రమ సంబంధం పెట్టుకొనే లేడి విలన్….అనసూయ

‘భీష్మ’ బ్లాక్ బస్టర్ హిట్టుతో జోష్ మీదున్న నితిన్ తాజాగా ‘అంధాదున్’ మూవీలో నటిస్తున్నాడు. అంధుడైన వ్యక్తి ఓ హత్యకు ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు. నిందితులను అంధుడు చట్టానికి ఎలా పట్టించాడు అనేది సస్సెన్ప్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.తెలుగు నేటివిటికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి రీమేక్ చేస్తున్న ఈ సినిమా నితిన్ అంధుడిగా, ప్లియోనో ప్లేయర్ గా కనించనున్నాడు. అలాగే నితిన్ సరసన హబ్బాపటేల్ ఎంపికైనట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో యాంకర్ అనసూయ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుందని సమాచారం అందుతోంది. . బాలీవుడ్ ‘అంధాదున్’లో సీనియర్ నటి టబు అక్రమ సంబంధం పెట్టుకొనే లేడి విలన్ పాత్రలో అద్భుతమైన నాటకీయతను పండించింది. ఈ పాత్రనే అనసూయ చేయనున్నట్లు సమాచారం.