జీ తెలుగు టెలివిజన్ ఛానల్ తో క‌ల‌సి సంద‌డి చేసిన మహేష్ బాబు

సంక్రాంతికి విడుద‌లైన ‘సరిలేరు నీకెవ్వరు’ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు  జీ తెలుగు టెలివిజన్ ఛానల్ తో క‌ల‌సి సంద‌డి చేయ‌నున్నారు .ఇప్ప‌టికే   జీ తెలుగు యూనిట్. ఆ ఛానల్ లో ప్రసారం అవుతున్న సీరియల్స్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయా సీరియ‌ల్స్‌లో న‌టిస్తున్న‌ నటులతో మహేష్ బాబు  క‌ల‌సి సీరియ‌ల్ పాత్ర‌ల గురించి చ‌ర్చించే, ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిస్తున్న ఈ ప్రోమోష‌న్ వీడియాని జి తెలుగు విడుద‌ల చేసింది.
మీ ప్రేమ, ఆద‌రాభిమానాలతో నన్ను సూపర్ స్టార్ ని చేసారు, సినిమా నన్ను నటుడిగా పరిచయం చేస్తే, టివి నన్ను మీ ఫ్యామిలీ మెంబెర్ ని చేసింది, జీ తెలుగు మీకు నాకు మధ్య వారధి అంటూ ప్రోమోలో మహేష్ బాబు పలికే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటు,   సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది. 

Leave a Reply

Your email address will not be published.