బీసీ లందరూ ఒకటే అనే నినాదంతో ముందుకు వెళ్ళాలి


ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో లభించిన సీట్లు మాత్రం 9 శాతం లోపే ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మే. అన్ని రాజకీయ పార్టీల నాయకులు పోటీలో నిలబడిన అగ్రవర్ణాల పెద్దలు బీసీలకు మేమే అండదండ వారికి మేమే చేయూత అందిస్తున్నామని చెప్పుకునే పార్టీల‌న్ని త‌మ అగ్ర‌వ‌ర్ణాల‌కే పెద్ద పీట వేస్తున్నాయి. ఇందుకు ఏపి రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో కానీ అక్క‌డ నుంచి ఎన్నికైనా పార్ల‌మెంటు స‌బ్యుల సంఖ్య‌ను ఓ సారి చూస్తే మ‌న‌కి ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. తాజాగా జనాభా పరంగా అధికంగా ఉన్న  సామాజిక వర్గాలకు  తాజాగా  ప్ర‌భుత్వం నిర్దేశించిన‌ స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు నిరూపిస్తున్నాయన‌టంలో సందేహం లేదు. 

 స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం ఉన్న బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించామ‌ని చెపుతున్న‌ప్ప‌టికీ    అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడు కూడా బీసీలకు రిజర్వేషన్లపై మాట్లాడ‌లేని పరిస్థితిలో ఉండ‌టం ఆందోళ‌న క‌లిగించేదే. అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ ఇతర పార్టీలు బీసీలకు అధిక సంఖ్యలో ఉన్న ఏ ఒక్కరు బీసీ రిజర్వేషన్ల కుదింపు ఎందుకు బయటకు రాని పరిస్థితి ఆ వేదన కలిగిస్తుంది.  మేం అధికంగా రిజ‌ర్వేష‌న్లు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటోంద‌ని, బిసిల పార్టీ అని చెప్పుకునే అర్హ‌త లేద‌ని అధికార పార్టీ చెప్పుకుంటుంటే, మ‌రి హైకోర్టు తీర్పుపై సుప్రీంకి వెళ్ల‌కుండా హ‌డావిడిగా కొత్త ఆదేశాలివ్వ‌డం వెనుక మ‌త‌ల‌బేంట‌ని తెలుగుదేశం నిల‌దీస్తోంది. పైగా ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాల ఆధారంగా బిసి రిజ‌ర్వేష‌న్లు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌న్న ఆరోప‌ణ‌తో సుప్రీం కోర్టులో బిసినేత‌, పార్ల‌మెంటు స‌భ్యుడు కింజ‌రాపు రామ్మోహ‌న‌రావు నాయుడితో పిల్ దాఖ‌లు చేయించినా పార్టీల న‌డుమ ఈ దూష‌ణ భూష‌ణ‌లు ఆగ‌టం లేదు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్న నినాదంతో  ముందుకు రావాల‌ని కొంద‌రు చెపుతున్నా… అందుకు అనుగుణంగా అడుగులు ప‌డ‌ని దుస్థితి.  బీసీల ఆత్మగౌరవం  వారి రాజ్యాధికారం తోనే  సాధ్యమవుతుందన్న వాస్త‌వాన్ని మ‌ర‌చిన వారంతా తమ రాజకీయ ప్రయోజనాల కోసం అడుగులకు మడుగులొత్తుతూ మౌనం వహించటం బీసీ సామాజిక వర్గాలకి అన్యాయం చేయడమే కాకుండా బీసీ వర్గాల బిడ్డల భవిష్యత్తు నాశనం చేసి వారి ఆత్మగౌరవాన్ని అగ్రవర్ణాలకు తాకట్టు పెట్టడాన్ని మేధావులు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  బీసీ లందరూ ఒకటే అనే నినాదంతో ముందుకు తీసుకెళ్లాలని కొంటున్న బీసీ సామాజికవర్గాలు మేము వేరు వేరు కాదు ఒకే కులం అనే నినాదంతో ముందుకు సాగితేనే తమ  హక్కులను సాధించుకుంటూ తమ రిజర్వేషన్లు తమ పదవులను దక్కించుకోవచ్చు అన్న వాస్తవాన్ని గుర్తుంచుకొని ఉద్యమిస్తే బీసీల బిడ్డలైన భావితరం లో రాజ్యాధికారాన్ని పొందే  అవకాశం ఉందని మేధావుల మాట. 

Leave a Reply

Your email address will not be published.