జగన్ కి షాక్ ఇవ్వనున్న మోహన్ బాబు..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి కి సినీ న‌టుడు మోహన్‌బాబు గ‌ట్టి షాక్ ఇచ్చేలా క‌నిపిస్తోంది.  ఆదివారం  ప్రధాని నరేంద్రమోడిని మోహ‌న్‌బాబు కుటుంబ స‌భ్యులు క‌లుసుకుని దాదాపు 45 నిమిషాల పాటు సమావేశం కావ‌టం ప‌ట్ల వైసిపి వ‌ర్గాల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈభేటిలో మోహన్‌బాబు క‌మ‌ల‌నాధుల‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని ప్రధాని మోడి సూచించ‌డంతో బిజెపిలో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసిన‌ట్టు సమాచారం. ప్రధానితో భేటీ అయిన సమయంలో ఆయనతో పాటు కుమారుడు మంచు విష్ణు, కుమార్తె లక్ష్మీ ప్రసన్న, కోడలు విరోనిక ఉన్నారు.

స్వర్గీయ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి తమ్ముడి కుమార్తెను కోడ‌లుగా చేసుకున్న మోహన్‌బాబు జగన్‌ కుటుంబం తో ఏర్ప‌డిన బంధుత్వం కార‌ణంగా వైసిపిలో చేరి  ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వహించారు. అయితే వైసిపి అధికారంలోకి వ‌చ్చాక టిటిడి చైర్మ‌న్ ప‌ద‌వి ఆశించిన మోహ‌న్ బాబుకి రిక్త‌హ‌స్తం అందింది. ఆపై సినిమాల‌కు సంబంధించిన ప‌ద‌వులైనా దొరుకుతాయ‌నుకున్నా అస‌లు త‌న పేరే జ‌గ‌న్ ప‌రిశీలించ‌క పోవ‌టం. క‌నీసం   బంధువు అని చూడ‌కుండా  త‌న‌ని   పట్టించుకోకపోవడంతోనే ఆయన పార్టీ మారాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది
కాగా సోమ‌వారం సాయంత్రం 6.30 గంటలకు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్‌షాను కూడా మోహన్‌బాబు కలవనున్నారు.  మోడీ ఆహ్వానాన్ని మన్నించి మోహన్‌బాబు కుటుంబం త్వరలో బిజెపిలో చేరతార‌ని  ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెపుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.