అంబానీల పెళ్లిలో టాప్ సెలబ్స్

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ ఇంట వరుస పెళ్లిళ్లతో బాజా మోగుతున్న సంగతి విదితమే. ఇదివరకూ అంబానీ కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ పెళ్లి కోసం ఏకంగా 700కోట్లు ఖర్చు చేసిన అంబానీ ముంబై- జియో వరల్ సెంటర్ లో జరిగిన కుమారుడు ఆకాష్ అంబానీ- శ్లోకా మెహతాల పెళ్లి కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారని ప్రచారం సాగుతోంది. ముంబై – కుర్లా కాంప్లెక్స్ నుంచి జియో సెంటర్ లో జరిగిన కుమారుడు ఆకష్ పెళ్లిలో సినీరాజకీయ నాయకులు సహా పారిశ్రామిక వేత్తలు క్రీడా రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో బాలీవుడ్ సెలబ్రిటీల సందడి ప్రత్యేకమైన గ్లామర్ ని తెచ్చింది. అయితే ఇదే పెళ్లిలో మరో విషయం గురించి సెలబ్రిటీలు సహా ప్రముఖులంతా ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ఈ పెళ్లి వేడుకలో బిగ్ బి అమితాబ్, జయా బచ్చన్, అభిషేక్ – ఐశ్వర్యారాయ్ – ఆరాధ్య అటెండ్ అయ్యారు. అలాగే అమీర్ ఖాన్ కుటుంబం, షారూక్ కుటుంబం, దిశా పటానీ- టైగర్ ష్రాఫ్ జంట, కియరా అద్వానీ, పూజా హెగ్డే, కరీనా కపూర్ తదితరులు ఎటెండయ్యారు.
ఓవైపు పెద్ద కొడుకు పెళ్లి వేడుక జరుగుతుండగానే ఇదే పెళ్లి సందడిలో ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి కాబోయే భార్య పైనా అందరి దృష్టి పడింది. ఈ పెళ్లిలో అంబానీ కి కాబోయే చిన్న కోడలు రాధిక సందడి అంతా ఇంతా కాదు. అంబానీలతో కలిసి వేదిక ఆద్యంతం రాధిక సందడి కనిపించింది.

Leave a Reply

Your email address will not be published.