గరుడవేగ లానే కల్కి ఓ కొత్త ఫీల్‌తో..!

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడుగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మిస్తున్న సినిమా కల్కి. అ! సినిమాతో విమర్శకుల ప్రశంసల్ని ప్రేక్షకుల అభినందనల్ని అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం రాజశేఖర్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జీవితా రాజశేఖర్ దంపతుల కుమార్తెలు శివానీ శివాత్మిక సినిమాటోగ్రాఫర్ దాశరథి శివేంద్ర తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ బర్త్‌డే కేక్ కట్ చేశారు.

రాజశేఖర్ మాట్లాడుతూ – సినిమా గురించి విడుదల తర్వాత మాట్లాడుతా. గరుడవేగ సమయంలోనూ సినిమా విడుదల తర్వాత మాట్లాడతానని చెప్పాను. ఇప్పుడు అంతే. గరుడవేగ తర్వాత ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు ఆరేడు నెలలు కథ కోసం అన్వేషించాం. అప్పుడే కదా ఓకే చేశాం. తర్వాత ప్రశాంత్ వర్మ డేట్స్ కోసం చాలా రోజులు ఎదురు చూశాం. గరుడవేగ కి ప్రవీణ్ సత్తారు తో పని చేసేటప్పుడు ఎంత కొత్తగా ఫీల్ అయ్యానో…. కల్కికి ప్రశాంత్ వర్మ తో పని చేసేటప్పుడు అంతే కొత్తగా ఫీల్ అవుతున్నా. చాలా రోజుల విరామం తర్వాత సి కళ్యాణ్ గారి సంస్థలో నేను నటిస్తున్న చిత్రమిది. నాకు ప్రమోషన్ వచ్చినట్టు భావిస్తున్నా. కళ్యాణ్ గారు విషయం లేకపోతే సినిమా చేయరు. కథ నచ్చడమే సినిమా విజయంలో ఓ మెట్టు ఎక్కినట్టు. పుట్టినరోజు నాడు కూడా షూటింగ్ చేస్తున్నాం.  లోకంలో పని దొరకడం చాలా కష్టం నాకు పని కల్పించిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు. జీవితం అన్నది చాలా తక్కువ రోజులు. అంతా సంతోషంగా అందరితో మంచిగా జీవితాన్ని ముందుకు సాగించాలి అని కోరుకుంటున్నా‘ అన్నారు.

నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ మా హీరోకి పుట్టినరోజు శుభాకాంక్షలు. సూపర్ డూపర్ హిట్ గరుడవేగ తర్వాత… డిఫరెంట్ సినిమా చేయాలనే ఉద్దేశంతో, విభిన్నమైన కథ తో చేస్తున్న చిత్రమిది. 1980 నేపథ్యంలో కథ సాగుతుంది. ఇంకా 30 పర్సెంట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో మిగతా షూటింగ్ పూర్తిచేసి మంచి తేది చూసి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఈ సినిమా పూర్తి బాధ్యత ప్రశాంత్ వర్మ మీద పెట్టాం. దర్శకుడికి అతడు తొలి సినిమా కంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. శేషు తర్వాత రాజశేఖర్ గారి తో నేను చేస్తున్న చిత్రమిది. నా సంస్థలో పనిచేయడం ప్రమోషన్ అని ఆయన అన్నారు. అది తప్పు. సి.కళ్యాణ్ అనే నిర్మాత చిన్న సినిమాలు చేసేటప్పుడు… లైట్స్ కొనడానికి కూడా డబ్బులు లేనప్పుడు ఓ తమిళ హిట్ సినిమా రీమేక్ రైట్స్ కొని నన్ను నిర్మాతను చేశారు జీవిత రాజశేఖర్ దంపతులు. గోరింటాకు సినిమా కు నాకు ఎంతో సహాయం చేశారు. మా కుటుంబ సభ్యులతో నేను చేస్తున్న చిత్రమిది అన్నారు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ నేను అ! చిత్రానికి ముందే మా జర్నీ మొదలైంది.  రాజశేఖర్ తో పనిచేయడం అద్భుతమైన అనుభూతి. ఆయన చాలా జోకులు వేస్తూ ఉంటారు. ఈ సినిమా కోసం ఒక్కరోజు 48 గంటలు కంటిన్యూగా షూట్ చేశాం. స్క్రిప్టు కోసం ఆల్మోస్ట్ 70 డ్రాప్స్ రాశాను. కల్కి అనేది చాలా పవర్ఫుల్ టైటిల్. టైటిల్లో ఎందుకంత డీటైలింగ్ చేశామనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. కొత్త కమర్షియల్ ఫార్మాట్ సృష్టించే సినిమా. ఈ సినిమాకు సీక్వెల్స్ ఒక ఫ్రాంచైజీ తరహాలో చేయాలి. అన్నీ కుదిరితే రాజశేఖర్ వచ్చే బర్త్ డే కి ‘కల్కి 2’ మొదలవుతుంది అన్నారు.

జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ -గరుడవేగ  సక్సెస్ ఎన్నిటికో సమధానమైంది. బాహుబలి గురించి మాట్లాడుతున్నప్పుడు గరుడవేగ గురించి కూడా మాట్లాడుతున్నారు. దాంతో నాకు చాలా సంతోషంగా ఉంది. అ! తర్వాత  చాలా అవకాశాలు వచ్చిన కల్కి కోసం ప్రశాంత్ డేర్ చేశాడు. మే లో సినిమా రిలీజ్ చేస్తాం.. అన్నారు.

అదా శర్మ, నందితా శ్వేత, స్కార్లెట్ విల్సన్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రాహుల్ రామకృష్ణ, నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, వెన్నెల రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) ప్రధాన తారాగణం.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర, సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, స్క్రీన్ ప్లే: స్క్రిప్ట్ విల్లే, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటర్: గౌతమ్ నెరుసు, స్టిల్స్: మూర్తి, లిరిక్స్: కృష్ణకాంత్ (కె.కె),  ఫైట్స్: నాగ వెంకట్, రాబిన్ – సుబ్బు, లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి, పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ.

Leave a Reply

Your email address will not be published.