నేటి నుంచి స‌రిలేరులో కొత్త సీన్స్‌….

సంక్రాంతికి విడుదలై సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకోవ‌టంతో పాటుసూపర్‌స్టార్‌ మహేష్ బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలచిన  ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాన్ని మ‌రింత ఎంట‌ర్‌టైన‌ర్‌గా మార్చే ప్ర‌య‌త‌నం చేస్తోంది చిత్ర యూనిట్ . ఇందుకు అనుగుణంగా ప్ర‌త్యేక స‌న్నివేశాలు చిత్రానికి జ‌త‌చేస్తోంది.
ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను  యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మీడియాకు అందించారు. త‌న సినిమాని అపూర్వంగా ఆదరిస్తున్న‌  ప్రేక్షకులకు, సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్‌బాబు అభిమానులకు కృతజ్ఞతలు తెలియ జేసిన ఆయ‌న ఇప్ప‌టికే సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్‌ చేస్తున్నట్టు అన్ని ప్రాంతాల నుంచి రిపోర్టులు అందుతున్నాయ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే  ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ని మ‌రింత‌ ఎక్కువ చేయాలని భావించామ‌ని, స‌రికొత్త‌గా కొన్ని స‌న్నివేశాల‌ను రూపొందించామ‌ని,  సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, రావురమేష్ కుటుంబ స‌భ్యుల మధ్య  ఈ హిలేరియ‌స్ సన్నివేశాల‌ను నేటి నుంచి (జనవరి 25-శనివారం) మార్నింగ్ షో నుండి అన్నిసెంటర్స్‌లలో జ‌త అయ్యి ప్ర‌ద‌ర్శించ నున్న‌ట్టు అనిల్ రావిపూడి చెప్పారు. ఈ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఆనంద ప‌ర‌చ‌టం ఖాయ‌మ‌ని చెప్పారాయ‌న‌.  

Leave a Reply

Your email address will not be published.