రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు…

 
నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అంటూ సంక్రాంతికి వచ్చి ప్రేక్షకులను నవ్వించిన రష్మిక పాప ఇంట్లో ఐటి సోదాలు జరుగుతున్నాయి.. ఐటీ అధికారులు కూడా నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు ఐటి సోదాలు జరిపి రష్మికకు షాక్ ఇచ్చారు . కర్ణాటకలోని కూర్గ్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక నివాసంలో  ఈరోజు ఉదయం నుండి ఆమె ఇంటిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 
గత రెండేళ్లుగా పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆమె, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్టు అనుమానిస్తున్న అధికారులు, దాడులు జరిపి, ఆమె ఆస్తిపాస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. కర్ణాటక, కొడుగు సమీపంలోని విరాజ్ పేటలో ఉన్న ఆమె ఇంటితో పాటు, బెంగళూరులోని ఫ్లాట్, కార్యాలయంలో కూడా ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. 
అయితే రష్మికకు తన ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలియటంతో ఆమె హుటాహుటిన హైదరాబాద్ నుండి కర్ణాటకలోని కూర్గ్ కు ప్రయాణమైనట్టు సమాచారం. అయితే ఇప్పుడిప్పుడే అవకాశాలు తెచ్చుకుంటున్న రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు జరగడం షాక్ అనే చెప్పాలి. సోదాలు పూర్తయిన తరువాత ఐటీ అధికారులు సోదాలకు సంబంధించిన వివరాలను తెలిపే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.