జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఝ‌ల‌క్

ఈ మ‌ధ్య ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం షెడ్యూలు కులాల‌ కార్పొరేషన్ ను మూడు కార్పొరేషన్లుగా విభజించి, ఓ ముగ్గురికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టింది. అయితే ఇది చెల్ల‌దంటూ హైకోర్టు ధ‌ర్మాస‌నం డివిజన్ బెంచ్  తీర్పును స‌మీక్షించుకోవాల‌ని మంగ‌ళ‌వారం ఆదేశాలు జారీ చేసింది.  
ఇందుకు సంబంధించిన వివ‌రాల‌లోకి వెళితే   రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ను  అధికార వికేంద్రీక‌ర‌ణ అని చెప్పుకొచ్చిమూడు కార్పొరేష‌న్‌లుగా విడగొట్టింది ఏపి ప్ర‌భుత్వం.  ఈ విష‌యంపై ఆలిండియా దళిత రైట్స్ ఫోరం జాతీయ అధ్యక్షులు కందుల ఆనందరావు ప్ర‌భుత్వ చ‌ర్య‌లు  రాజ్యాంగ విరుద్ధ‌మంటూ   W.A.No.108/2020 హైకోర్టులో  కేస్ ఫైల్ చేసారు. అయితే ఈ కేసు విచారించిన   సింగిల్ జడ్జి కేసును  కొట్టివేస్తూ ఎస్సీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్స్ గా విభజించుకోవ‌చ్చ‌ని తీర్పు చెప్పింది. 

దీంతో  సింగిల్ జ‌డ్జి తీర్పుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ,  ఆయ‌న‌  డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసారు. ఈ రోజు (మంగళవారం) ఈ W.A.No.108/2020 కేసును విచారణ చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయ సూర్య తో కూడిన ధ‌ర్మాస‌నం, ఎస్సీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్ విభజించడం రాజ్యాంగ వ్యతిరేకమని,  ఆ తీర్పును సమీక్షించుకోవాలని  సింగిల్ జడ్జి కి సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

  తన తీర్పును సమీక్షించుకోవాల‌ని, ఈ కేసులో ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయమని ఆదేశాలిస్తూ,  రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం తీర్పు ఇవ్వవలసిందిగా  స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చెల్లదని  చెప్పినప్పటికీ దానికి విరుద్ధంగా నే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ విడగొట్టటం రాజ్యాంగ వ్యతిరేకంగా భావించి  ఈ కేసు వేయడం జరిగింద‌ని  ఆలిండియా దళిత  రైట్స్ ఫోరమ్  తెలిపింది. 

Leave a Reply

Your email address will not be published.