‘విరాట పర్వం’…రానా ఫస్ట్ లుక్ రిలీజ్‌


దగ్గుబాటి రానా ప్రస్తుతం ‘విరాట పర్వం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈచిత్రం యొక్క షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈషెడ్యూల్ లో రానా పాల్గొంటున్నాడు. ఇక ఈ రోజు రానా బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ విరాటపర్వం నుండి రానా ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. నీదినాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ ,  ఈచిత్రం లో ఆమె నక్సలైట్ పాత్రలో కనిపించనుందని సమాచారం. వీరితో పాటు మలయాళ నటి నందితా దాస్ కీలక పాత్రలో నటిస్తుంది.1990 బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్సివ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసురేష్ ప్రొడక్షన్స్ , ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ల పై సురేష్ బాబు , చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published.