సీఎం హోదాలో సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి..


జగన్ ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి అయిన తరువాత మొట్టమొదటిసారిగా హైదరాబాదులో సీబీఐ కోర్టుకు ఈరోజు హాజరయ్యారు. గత శుక్రవారం నాడు సిబిఐ కోర్టు జగన్ను విజయసాయిరెడ్డిని తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావలసిందిగా ఆదేశించడం అయినది. ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలనా వ్యవహారాలు ఉంటాయి కనుక హాజరు మినహాయింపు కోరుతూ జగన్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అదే పిటిషన్పై గత 16 వారాలుగా జగన్ సిబిఐ కోర్టుకు రావడం లేదు. పైపెచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావున సీబీఐ కోర్టుకు హాజరు అవడం వల్ల భారం పెరుగుతుందని అది ప్రజల మీద పడుతుందని కాబట్టి మినహాయింపు కోరారు. ప్రజా ప్రతినిధులు చాలామంది సీబీఐ కోర్టుకు హాజరు అయ్యారని ఇందుకు పదవులతో ప్రమేయం లేదని తేల్చిచెప్పింది సీబీఐ కోర్టు. పైగా మీరు ఉన్నత పదవుల్లో ఉన్నారు గనుక సాక్షులను తారుమారు చేసే ప్రమాదం ఉందని కూడాకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఈ రోజు జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కాక తప్పలేదు. జగన్ తో పాటు  విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published.