జైహింద్ ఇండియా స్ట్రైక్స్ బ్యాక్…….. వైమానిక దాడులకు బాసటగా తారల నినాదం

దాడికి ప్రతిదాడి చేసి గెలిచి చూపించడం వీరుడి లక్షణం. భారత్ పరాక్రమం ఏంటో దాయాది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు తెలిసొచ్చింది. భారత వైమానిక దళం.. ఎల్‌ఓసీ ఉగ్రవాదులపై మెరుపు దాడులతో ప్రతీకారం తీర్చుకుంది. కొన్ని రోజుల క్రితం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరవీరులయ్యారు. దీనికి ప్రతీకారం ఇలా ఉంటుందని భారత వైమానిక దళం నిరూపించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీసెలబ్రిటీలు భారత్ చేపట్టిన మెరుపుదాడులపై హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వెల్లడించారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి,  కమల్ హాసన్, మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అఖిల్, వరుణ్ తేజ్, మెహరీన్.. సోనాక్షి సిన్హా, నితిన్, ఉపాసన, వెంకీ అట్లూరి, అక్షయ్‌కుమార్, అభిషేక్ బచ్చన్, అజయ్‌దేవగన్, కంగన.. తదితరులు సోషల్ మీడియా ద్వారా భారత పరాక్రమం పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ దాడులపై ఎవరెవరు ఎలా స్ప ందించారు? అంటే…

*ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వందనం. జై హింద్ ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ – ఎస్.ఎస్ రాజమౌళి
*పాకిస్తాన్ తీవ్రవాద క్యాంపులలో విధ్వంసం సృష్టించి భద్రంగా తిరిగివచ్చిన మన సైనికుల వీరత్వానికి వందనం.  ఈ హీరోలను చూసి భారతదేశం గర్విస్తోంది-  కమల్ హాసన్
*మన దేశం సరైన సమాధానం ఇచ్చింది.ఇండియా స్ట్రైక్స్ బ్యాక్  భారత వాయుసేనకు వందనం. జైహింద్  ఎన్టీఆర్
*మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి నేను గర్విస్తున్నాను. భారత వాయుసేనకు చెందినా వీరులైన పైలట్ లకు వందనం  మహేష్
*ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి నేను గర్విస్తున్నాను. జై హింద్ ఇండియా స్ట్రైక్స్ బ్యాక్-  రామ్ చరణ్
*ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు వందనం-  వరుణ్ తేజ్
*ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను చూసి నేను గర్విస్తున్నాను. జై హింద్ ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ – ఉపాసన కొణిదెల
* బుల్లెట్ దిగిందా లేదా  పూరీ జగన్నాథ్
* ఎవడు కొడితే ఉగ్ర శిబిరాలన్నీ బ్లాక్ అయిపోతాయో వాళ్లే మన సైనికులు-
* మేం సమాధానం ఇస్తే సమాధులు కట్టుకోడానికి మీకు శవాలు కూడా దొరకవు-  కోన వెంకట్
* చేతులు ముడుచుకుని కూర్చునే టైం కాదని ప్రపంచానికి మనం నిరూపించాం. భారత వైమానిక దళానికి హృదయపూర్వక శుభాకాంక్షలు-
* భారత వైమానిక దళానికి సెల్యూట్. జై హో. జై హింద్-  నితిన్
* సెల్యూట్ ఐఏఎఫ్. మన దేశానికి ఎంతో గర్వకారమైన రోజిది-  అఖిల్
* భారత వైమానిక దళానికి మేం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం  అభిషేక్ బచ్చన్
* ధైర్యం చేసి శత్రువుల గుండెల్లోకి నేరుగా గురిచూసి కొట్టిన డేర్డెవిల్ ఐఏఎఫ్ పైలట్లకు సెల్యూట్-  మధుర్ భండార్కర్
* జైషే పరిస్థితి ఎలా ఉంది?.. నాశనమైపోయింది-  రష్మి
* ఉగ్ర శిబిరాలను అంతమొందిస్తున్న మన భారత వైమానిక దళాం పట్ల గర్వంగా ఉంది అక్షయ్ కుమార్
* మాతో పెట్టుకుంటే ఇలాగే చచ్చిపోతారు.. సెల్యూట్ – అజయ్ దేవగణ్
* మంచి వార్తతో శుభోదయమైంది. ఆర్మీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదా

Leave a Reply

Your email address will not be published.