బాలయ్య సినిమాల‌ కు దూరంగా ఉంటున్న నంద‌మూరి ఫాన్స్?

బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’.  బాలయ్య కెరియ‌ర్‌లో ఇది 105వ చిత్రం. ‘జై సింహా’ తర్వాత కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బాలకృష్ణ..ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెట్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించాల‌నుకుంటున్నాడు. అయితే ఈ సారి మాత్రం ఎందుకో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంద‌రూ బాల‌య్య మూవీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. దానికి కార‌ణం లేక‌పోలేదు. ఆయ‌న గ‌త రెండు చిత్రాలు ఎన్టీఆర్ బ‌య‌పిక్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు రెండూ ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి. అందులోనూ తండ్రి పాత్ర‌లో కొడుకు న‌టించ‌డం. ఎన్టీఆర్పాత్ర‌లో  బాల‌య్య న‌టించ‌డంతో ఆ చిత్రాల పై మ‌రింత క్రేజ్ పెరిగింది. ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్లు అవుతాయ‌నే ఆశ‌తో ఉన్న ఫ్యాన్స్‌కు నిరాశే మిగిల్చాడు బాల‌కృష్ణ. క‌థానాయ‌కుడు కాస్త ప‌ర్వాలేద‌నిపించుకున్నావ‌సూళ్ళు మాత్రం రాబ‌ట్టుకోలేక‌పోయింది. రెండో భాగం మ‌హానాయ‌కుడు ఎల‌క్ష‌న్ల ముందు విడుద‌ల చెయ్యాలా వ‌ద్దా అన్న‌ట్లు విడుద‌ల చేశారు.

ఎన్టీఆర్ జీవితంలో కీల‌క‌మైన అంశాల‌ను తీసిన మ‌హానాయ‌కుడు రెండు కోట్ల షేర్ కూడా రాబ‌ట్టుకోలేక‌పోయింది. భ‌యంక‌ర‌మైన వ‌సూళ్ళ‌తో సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. దాంతో ఈ సినిమా క‌లెక్ష‌న్లే నంద‌మూరి అభిమానులు కూడా ఈ చిత్రాల్ని ఆద‌రించ‌ల‌ద‌ని అర్ధ‌మ‌వుంతుంది. ఒక‌ప్పుడు బాల‌య్య సినిమాల‌కు హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా క‌లెక్ష‌న్లు ఉండేవి. అయితే ఎన్టీఆర్ బ‌యోపిక్ మాత్రం ఫ్యాన్స్ కూడా అనేక కార‌ణాల చేత ఫ్యాన్స్ కూడా ప‌ట్టించుకోలేదు. అలాగే అదే స‌మ‌యానికి విడుద‌లైన రామ్‌గోపాల్ వ‌ర్మ తీసిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల ఆద‌ర‌ణ  బాల‌య్య‌కు క‌రువైన‌ట్లే అని చెప్ప‌వ‌చ్చు. 


Leave a Reply

Your email address will not be published.