‘ప్రతి చిన్నారికీ విద్య అనేది మన కల – ప్రియాంక చోప్రాపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన జామియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ విద్యార్థులపై పోలీసులు దాడి చేయడంపై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న వారిపై దాడి సరికాదని వ్యాఖ్యానించింది. ‘ప్రతి చిన్నారికీ విద్య అనేది మన కల. వారు స్వతంత్రంగా ఆలోచించగలగే శక్తిని చదువు మాత్రమే ఇస్తుంది. మన పిల్లలు వారి గొంతుకను వినిపించేలా మనం వారిని పెంచుతున్నాం. ప్రజాస్వామ్య దేశంలో తన గొంతుకను శాంతియుతంగా వినిపిస్తున్న వారిపై హింస సరికాదు. మారుతున్న భారత్ కోసం ప్రతి గొంతుక పని చేస్తుంది’ అంటూ ట్వీట్ చేసింది. 

Leave a Reply

Your email address will not be published.