ఆ మిస్టరీ ఏంటో సస్పెన్స్! – నివేద …… ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతే!

ఇకపై ఏం జరగబోతోంది? అన్నది ముందే తెలిసిపోతే.. ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. అలాంటి కాన్సెప్టుతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ 118. ఈ సినిమా ఆద్య ంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ రక్తి కట్టిస్తాయి అని అంటున్నారు నివేధ థామస్. జెంటిల్మేన్, నిన్నుకోరి వంటి హిట్ చిత్రాల్లో నటించిన నివేద నటించిన తాజా చిత్రమిది. కళ్యాణ్ రామ్ ఈ చిత్రంలో కథానాయకుడు. గుహన్ దర్శకత్వ ం వహించారు. మహేష్ కోనేరు నిర్మించారు. మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భ ంగా హైదరాబాద్ లో జరిగిన ఇంటర్వ్యూలో నివేద థామస్ చెప్పిన సంగతులివి..

118 మిస్టరీ ఏంటో రివీల్ చేస్తారా?
*ఈ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్. మిస్టరీ ఏంటి అన్నది తెరపైనే చూడాలి. ఒక కుర్రాడికి కలలు వస్తుంటాయి. ఇది ముందే జరిగినట్టు ఉందే.. ఇదే ప్లేస్‌లో ఇంతకుముందు జరిగింది.. అంటూ పరిశోధించే జర్నలిస్టు కథ ఇది. కళ్యాణ్ రామ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటించారు. నాజర్  డాక్టర్ గా కనిపిస్తారు. ఈ సినిమా కథలో ఫిక్షన్ ఆకట్టుకుంటుంది.

మీ రోల్ గురించి?
*ఈ చిత్రంలో నా పాత్ర పరిధి చిన్నదే. కానీ ఎంతో కీలకమైనది. చివరి 20 నిమిషాలు నేను కనిపిస్తాను. స్క్రీన్ టైమ్ తక్కువే. సినిమా లెంగ్త్ కూడా తక్కువే. 2.10 నిమిషాల సినిమా ఇది. కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా గురించి, పాత్ర గురించి ముందే చెప్పారు. వెంటనే ఒప్పుకున్నాను.

స్క్రీన్ టైమ్ పట్టించుకోరా?
*నా స్క్రీన్ టైమ్ ఎంత? అన్నది ఇంపార్టెంట్ కాదు. నా పాత్ర కథలో ఎంత భాగం. ఎంత బావుంది అన్నది ఇంపార్టెంట్. కథ, పాత్ర నచ్చితే సినిమా చేయడానికి అంగీకరిస్తాను.

దర్శకుడి గురించి?
*దర్శకుడు గుహన్ తన నాన్నగారితో కలిసి ప్రయాణించినప్పుడు ఈ లైన్ స్ఫురణకు వచ్చిందిట. ఇలాంటి అనుభవం తనకు రియల్ లైఫ్ లో ఉంది. అయితే సినిమా పరంగా దానిని ఫిక్సనలైజ్ చేసి స్క్రిప్టును రాసుకున్నారు.

స్క్రిప్టులో మిస్టీరియస్ సన్నివేశం?
*ఈ చిత్రంలో పాత్రను చాలా జాగ్రత్తగా డిజైన్ చేశారు. ఒక అమ్మాయికి ఓ సిట్యుయేషన్ ఎదురైనప్పుడు ఎలా రియాక్టవుతుంది? అన్నది స్పష్టంగా చూపించారు. ఇందులో జర్నలిస్టు పరిశోధన ఏంటి? అన్నది చూడాలి.

రియల్గా మీకు అలా అయ్యిందా ఎప్పుడైనా?
*రియాలిటీలో నాకు కూడా కొన్నిసార్లు ఇకపై ఏం జరుగుతోందో తెలిసిన సందర్భ  ం ఉంది. అయితే అది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది.

తారక్ ప్రీరిలీజ్ వేడుకలో ప్రశంసించారు కదా!
*కళ్యాణ్ రామ్ .. తారక్ గౌరవం తెలిసిన హీరోలు. ఒక సహనటిని తారక్ ప్రశంసించడం అన్నది వారి గొప్పతనం. ఆరోజు తారక్ అలా ప్రశంసించడం ఊహించలేదు. ఆయన సినిమా చూశారు అన్నదే తెలీదు. ఆ ప్రశంసతో చాలా ఉద్వేగానికి లోనయ్యాను.

అన్వేషణ కథలా ఉంటుందేమో?  భానుప్రియ అభినయం మీకు తెలుసా?
*అన్వేషణ సినిమా నేను చూడలేదు. కానీ ఆ సినిమా ఓ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని తెలుసు. భానుప్రియ గొప్ప నటి అని తెలుసు. 118 చిత్రానికి తొలుత అన్వేషణ అనే టైటిల్ ని  అనుకున్నారు. కానీ చివరిగా 118 టైటిల్ ని ఎంచుకున్నారు. థియేటర్లలో సినిమా చూశాక ఆడియెన్ కి ఆ సస్పెన్స్ నచ్చుతుంది.

హాలీవుడ్ లో ఫైనల్ డెస్టినేషన్ లైన్ ఇలానే ఉంటుంది కదా?
ఫైనల్ డెస్టినేషన్ ఇంట్రెస్టింగ్ మూవీ. ఆ సినిమా లైన్ ఆసక్తికరం. అయితే దాంతో మా సినిమాకి ఏ పోలికా ఉండదు. ఇక్కడ ఒక ప్రత్యేకతతో కథనం నడుస్తుంది.

బ్రోచేవారెవరురా గురించి?
*బ్రోచేవారెవరురా నా తర్వాతి సినిమా. ఇది నా కెరీర్ లో పూర్తి విభిన్నమైన సినిమా. ఇప్పటివరకూ చేయనంతగా కామెడీ చేశాను. ఎలా వస్తుందో అని ఆసక్తిగా వేచి చూస్తున్నా. జెంటిల్మేన్, నిన్ను కోరి చిత్రాల్లో పాత్రలకు ఇది పూర్తి డిఫరెంట్. 118 లో రోల్ వేరుగా ఉంటుంది. బ్రోచేవారెవరురా చిత్రంలో నా పాత్ర పూర్తి విభిన్నమైనది.

జై లవకుశ తర్వాత ఎందుకు గ్యాప్?
*నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాను.. ఈ చదువుల కోసం… జై లవకుశ తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్నా. స్టడీస్ కూడా నాకు చాలా ఇష్టం. అందుకే అప్పట్లో గ్యాప్ తీసుకున్నాను.

ఇతర సినిమాల గురించి?
*ౠశ్వాసౠ అనే ట్రావెల్ బ్యాక్ డ్రాప్ చిత్రం చేస్తున్నా. మార్చి మిడిల్ లో ప్రారంభం కానుంది. తమిళంలో ఓ చిత్రం చేయబోతున్నా. 2019 ద్వితీయార్థంలో సినిమా ఉంటుంది. మలయాళంలో ఇప్పటికి ఇంకా లేదు. వేగంగా సినిమాలు చేసేకంటే మంచి సినిమాలు చేసేందుకు ఇష్టపడతాను.

తెలుగమ్మాయిలతో పోటీ ఉందా?
* తెలుగమ్మాయిలకు నేను పోటీ అని.. వాళ్లు నాకు పోటీ అని నేను అనుకోను. ఆ అమ్మాయి సినిమానే ఎందుకు బాగా రావాలి అని అనుకోను. నేను ఒక నటిగా నిరూపించుకోవాలని.. నాకు కొంత స్పేస్ ఉందని మాత్రమే అనుకుంటాను. నన్ను నేను నటిగా తీర్చిదిద్దుకునేందుకే ఇష్టపడతాను. ఏదైనా సినిమా చేస్తే నేను ఎలా చేస్తాను? అన్నది ముందుగానే ఊహించి స్క్రిప్టుల్ని ఎంపిక చేసుకుంటాను. 

Leave a Reply

Your email address will not be published.