సంక్షేమానికి చిరునామా ఆయన

నిరంతర కృషీ వలుడుగా తెలంగాణ సిఎం కేసీఆర్‌కు పేరుంది. తను అనుకున్నది సాధించాలన్న అసాధారణ పట్టుదల, అంతకు ంచి దాన్ని సాధించాలన్న తపన , తనపై తనకు ఉన్న అచంచలమైన ఆత్మవిశ్వాసం తో అసాధ్యమైన విషయాలనెన్నింటిలో సుసాధ్యం చేసి చూపిన వ్యక్తులకు నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ అనటంలో సందేహం అవసరం లేదు.
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా అధికారిక పదవులను కాలదన్నుకుని తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన బైటకు వచ్చిన తొలి నాళ్లలో ఒంటరిగానే తన ప్రయత్నాలు ఆరంభించారు. ఒక్కో వర్గాన్ని తనదైన మాటలతో తిప్పుకుంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలసి వచ్చిన ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసారు. కించత్ రక్తపాతం చిలక కుండా ఇంతటి మహోన్నత ఉద్యమాన్నినిర్మించిన ఘన కేసీఆర్‌దే కావడం విశేపం.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుకు అందరితో అద్భుత వ్యక్తిగా పేరొందిన కేసీఆర్, తెలంగాణ వచ్చాక తన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి జనరంజక పాలన అందించంతో పాటు సంక్షేమానికి రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేసారు. విమర్శకుల నోళ్లు మూయిస్తూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనివార్య పరిస్థితిని కలిపించేలా ప్రత్యేక పథకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతలో సాగుతున్న కేసీఆర్ పాలన దేశాన్ని ఆకట్టుకుంటోంది.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లను ఎద్దేవా చేసిన పార్టీల నేతలే అవాక్కయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిపి తెలంగాణాకు ఆయన అపర భగీరథుడయ్యాడని చెప్పక తప్పదు. బీరుడారుతున్న తెలంగాణ లో ప్రతి ఎకరానూ తడిపేందుకు వీలుగా ముందు చూపుతో కేసీఆర్ చేపట్టిన పథకాలను నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిందంటే ఆశ్చర్యమేముంది?
కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు పేదలకు భరోసానిచేలా చేసాయి. అందుకే ప్రతి ఎన్నికలలో కేసీఆర్ నేతృత్వంలోని టిఆర్ ఎస్ తన విజయపరంపరని కొనసాగిస్తూ వస్తోంది. ఇక రాష్టంలోని రైతాంగానికి పెట్టుబడి సాయం కింద కొంత మొత్తాన్ని అందించాలని నిర్ణయించి ప్రవేశ పెట్టిన రైతు బంధు పథకం ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మన్ యోజనని ప్రవేశ పెట్టింది,
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ఎన్ని విమర్శలు వచ్చినా సంక్షేమంతో కూడిన అభివృద్ధి కే తన ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్నారు. ఆర్ధికంగానూ రాష్ట్రాన్ని నిలదొక్కుకునేలా పరిశ్రమలు స్థాపించేందుకు వీలుగా టీఎస్ ఐపాస్ విధానం అంరినీ ఆకట్టుకునేలా చేసింది. దీంతో ఇతర రాష్ట్రాలలో అధికారులు, ప్రభుత్వాలతో ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలకు తెలంగాణలో కీలక భూమిక పోషించే సౌలభ్యం కలిగిస్తున్నారు . క్షణాలలో అనుమతులు ఇవ్వడం లాంటి కీలక పరిణాలతో ఇప్పుడు పారిశ్రామిక వేత్తల దృష్టి తెలంగాణ వైపుకు మల్లింది.
ఇక గత ఐదేళ్లలో మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయి హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుందనే చెప్పాలి. ప్రపంచ వ్యాస్తంగా ఉన్న . పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు మార్గం షురూ చేసుకుంటున్నాయి. దీంతో ఉద్యోగ కల్పనలోనూ ధీటుగా నిలుస్తుండటంతో యవత కూడా కేసీఆర్‌కి నీరాజనాలు పడుతోంది.
చాలా మంది తెలంగాణ జాతిపితగా అభివర్ణించే కేసీఆర్ రాష్ట్రాన్ని మరింతగా ప్రగతి పథంలో నడపేందుకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలందిస్తోంది eeroju news