‘వి’ సినిమా పోస్టర్‌ను విడుదలనేచురల్‌ స్టార్‌ నాని రాక్షసుడి తరహా పాత్రలో కనిపించనున్న స‌రికొత్త చిత్రం ‘వి’..మరో హీరో సుధీర్‌బాబు  పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో క‌నిపిస్తున్నాడు.  ఈ మ‌ధ్య వీరిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను చిత్రయూనిట్‌ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేసింది. 

ఇందులో సుధీర్‌బాబు స్టైలిష్‌ లుక్‌తో కనపడుతుంటే.. నాని మెలితిప్పిన మీసాలతో ర‌ఫ్‌ లుక్‌లో కనపడుతున్నారు.   డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తుండ‌గా,. అదితిరావు హైదరి, నివేదాథామస్ క‌ధానాయిక‌లుగా న‌టిస్తున్నారు.  
హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో శిరీష్‌, హర్షిత్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఉగాది సందర్భంగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ సినిమా  టీజర్‌ను ఫిబ్రవరి 17న విడుదల చేస్తున్నారు 

 

Leave a Reply

Your email address will not be published.