‘ఇద్దరి లోకం ఒకటే` సెన్సార్ పూర్తి.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మాతగా
యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందుతోన్నలవ్ ఎంటర్టైనర్ `ఇద్దరి లోకం ఒకటే`. ఈ చిత్రానికి జీఆర్.కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తున్నారు చిత్ర నిర్మాత దిల్‌రాజు. మీడిమాలో ఈ సినిమా విశేషాలు వివరిస్తూ, “మా బ్యానర్లో రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తోన్న రెండో చిత్రమిది. క్యూట్ లవ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమాను డైరెక్టర్ కృష్ణ తెరకెక్కించారన్నారు.. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు చాలా మంచి స్పందన వచ్చిందని. త్వరలోనే మిగిలిన పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. సినిమా సెన్సార్ పూర్తయ్యింది కనుక సంక్రాంతి సినిమాలకు పోటీ అనను గానీ డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాము“ అన్నారు. చిన్న చిత్రాలలో ఇది మేటి చిత్రంగా నిలవటం ఖాయమని తెలిపారు.