విద్యుత్ చార్జీలు యథాతధం…..

రానున్న ఆర్ధిక సంవ‌త్స‌రానికి
విద్యుత్ చార్జీలు పెంచ‌బోమ‌ని ఏపి ఇఆర్సి కి ఇంధ‌న శాఖ స‌ల‌హ‌దారు రంగ‌నాధం ప్ర‌భుత్వం
త‌ర‌పున విద్యుత్ నియంత్రణ మండలికి సమాధానమిచ్చారు. అటు విద్యుత్ సంస్ధ‌లు
ఎదుర్కోంటున్న లోటును భ‌ర్తి చేసేందుకు ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుంద‌న్నఆయ‌న ప్ర‌జ‌ల‌కు
నిరంత‌ర విద్యుత్ అందించేందుకు అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు. అయితే అంత‌కుముందు
విజ‌య‌వాడ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ద‌క్ష‌ణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ధ కార్య‌ల‌యంలో
వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల విజ్ఞ‌ప్తుల‌పై విద్య‌త్ నియంత్ర‌ణ మండ‌లి అభిప్రాయ సేక‌ర‌ణ
చేసింది. అనంత‌రం సంభందిత శాఖా అధికారుల‌కు ప‌లు ఆదేశాలు ఇవ్వ‌డంతో పాట ప్ర‌భుత్వానికి
ప‌లు సూచ‌న‌లు చేసింది…
ఏపి విద్యుత్ నియంత్ర‌ణ
మండ‌లి మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ ఏపిఎస్పిడిసిఎల్ కార్య‌ల‌యంలో రోజంతా ప్ర‌జాభిప్రాయాన్ని
సేక‌రించింది. ముఖ్యంగా గ‌తంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు  ఒప్పందాల వ‌ల్ల
పంపిణీ సంస్ద‌లు ఆర్దికంగా కుప్ప‌కూలిపోతున్నాయ‌ని చివ‌ర‌కు ఈ భారాన్ని వినియోగ‌దారుడిపై
నెట్టేస్తున్నార‌ని ఫిర్య‌దు చేశారు. ఎన్నికల సంవ‌త్స‌రం కావ‌డంతో ఈసారి విద్యుత్
చార్జీలు పెంచ‌బోమ‌ని చెపుతున్నార‌ని ఒక సారి ఎన్నిక‌లు పూర్త‌యితే సామాన్యుడికి
వీరు షాక్ ఇస్తారంటున్నారు. రైతుల‌కు 
24 గంట‌లు క‌రెంటు ఇస్తే అస‌లు ఉద్దేశం ప‌క్క‌దోవ
ప‌ట్టే ప్ర‌మాదం ఉంద‌ని అంటున్న విచార‌ణ‌కు వ‌చ్చిన నిపుణులు. ప్ర‌భుత్వం పంపిణీ
సంస్ధ‌ల‌కు అండ‌గా నిల‌వ‌డంతో పాటు ప్ర‌జ‌ల‌పై భారం ప‌డ‌కుండా చూడాల‌న్నారు. అటు
ఇప్ప‌టికే రాష్ట్రంలో విద్యుత్ సంస్ద‌ల లెక్క‌ల ప్ర‌కారం రానన్న ఏడాది మిగులు
విద్యుత్ 
25 నుండి 30 మిలియ‌న్ యూనిట్లు
ఉంటుంద‌ని అయితే దీన్ని కోనుగోలు చేసే వారే ఉండ‌ర‌ని చివ‌ర‌కు అవ‌స‌రం లేని
విద్యుత్ ఉత్ప‌ద‌న‌కు ప్ర‌జాధ‌నం వృదా అవుతుందని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణం
ఈ ఒప్పందాల‌ను పున‌స్స‌మీక్షించాల‌న్నారు.
బెల్లం రైతుల‌కు విద్య‌త్
క‌నెక్ష‌న్ తెచ్చుకోవ‌డం బెల్లం రైతుకు పెద్ద‌స‌వాలుగా మారింద‌ని భార‌తీయ కిషాన్
సంఘ్  నాయ‌కులు పిర్య‌దు చేశారు. ఇప్ప‌టికైనా ఈ జాప్యాన్ని త‌గ్గించ‌డంతో
పాటు రైతుకు ఉచితంగా క‌నెక్ష‌న్ ఇవ్వాల‌ని వారు డిమాండు చేశారు. విద్య‌త్ శాఖ‌లోని
అధికారి ప్ర‌మాద‌వ శాస్తూ చ‌నిపోతే ప‌దిల‌క్ష‌లు ఇస్త‌న్న సంస్ధ‌లు రైతు చ‌నిపోతే
మాత్రం వివిధ కార‌ణాల‌తో ప‌రిహ‌రాన్ని ఇవ్వ‌డం లేద‌న్నారు. ఒక్క ఏడాది కాలంలో 
250మంది రైతులు చ‌నిపోతే కేవ‌లం 40 మందికి మాత్ర‌మే ప‌రిహ‌రం
ఇచ్చార‌న్నారు. అటు హైటెన్ష‌న్ వైర్ల ఒక ఐఏఎస్ అధికారి పోలంలోనుండి వెళితే ఆయ‌న‌కు 
60నుంచి 80 ల‌క్ష‌లు ఇచ్చిన
అధికారులు రైతుకు అయిదు ల‌క్ష‌లు  కూడా ఇవ్వ‌డం లేద‌ని మండిప‌డ్డారు..
 ఉద‌యం ప‌దిగంట‌లు మొద‌లు
కొని సాయంత్రం అయిదు గంట‌లు వ‌ర‌కూ ప్ర‌జాభిప్రాయ‌న్ని సేక‌రించిన జ‌స్టిస్ 
భ‌వానీ ప్ర‌సాద్
క‌మీష‌న్
స‌బ్యులు రామ్మెహ‌న్ 
ర‌ఘులు ఈ ఏడాది పంపిణీ సంస్ధ‌ల న‌ష్టాన్ని
ఎనిమిది వేల 
963కోట్ల రూపాయ‌లు మేర ప్ర‌భుత్వం
భ‌ర్తీ చేయాల‌ని సిఫార‌స్స చేశారు. అట విద్య‌త్ క‌నుగోలు ఒప్పందాల నుండి బ‌య‌ట‌కు
రావ‌డం ప్ర‌భుత్వానికి సాధ్యం కాద‌ని పేర్కోన్న క‌మీష‌న్ ఛైర్మ‌న్ రైతుల‌కు
ఇబ్బందులు లేకుండా విద్యుత్ అందించేలా సిఫార‌స్సు చేశారు..

Leave a Reply

Your email address will not be published.