మంత్రి వర్గ ప్రక్షాళన లో ఈ ఇద్దరికీ ఛాన్స్ఓవైపు స్థానిక ఎన్నిక‌ల స‌మ‌రంలో దాడుల‌తో అన్నింటినీ ఆధీనంలోకి తీసుకువ‌చ్చేందుకు మంత్రులు ప్ర‌య‌త్నిస్తుంటే. ఏపీ కేబినెట్ ప్ర‌క్షాళ‌న మ‌రోవైపు చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే పిల్లి సుభాష్‌చంద్ర‌బోస్‌, మోపిదేవిలు రాజ్య‌స‌భ‌కు వెళ్తున్న క్ర‌మంలో త్వరలోనే తమ మంత్రి పదవులకు రాజీనామా చేయనున్నారు.  దీంతో రెండు బెర్త్‌లు ఖాళీ కానున్నాయి. వీటితో పాటు స్థానిక ఎన్నిక‌ల‌లో వ‌చ్చిన ఫ‌లితాల ఆధారంగా మంత్రి ప‌ద‌వుల‌పై ఆశ పెట్టుకున్న కొంద‌రు అప్పుడే జ‌గ‌న్‌ని క‌ల‌సిన‌ట్టు స‌మాచారం అందుతోంది. ఇప్ప‌టికైతే  పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల స్థానాల‌లో  మ‌రో ఇద్దరు బీసీ వర్గానికి చెందిన వారినే  మంత్రులుగా తీసుకునే అవకాశం ఎక్కువ‌గా ఉంద‌ని పార్టీ వ‌ర్గాల‌లో వినిపిస్తున్న మాట‌. ప్ర‌ధానంగా వీరిలో  తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌, గుంటూరు జిల్లా నుంచి   చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీల‌కు ఖ‌చ్చితంగా అంద‌లం అభిస్తుంద‌ని  వైసీపీ వర్గాలు చెపుతున్నాయి.  

వీరితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లో మెరుగైన ఫ‌లితాలు తీసుకువ‌చ్చేఎమ్మెల్యేలకే ఈ సారి ప‌దువులు ద‌క్కే ఆస్కారం ఉంది. అలాగే  స్థానిక ఫలితాల ఆధారంగా కొందరు మంత్రులపై వేటు పడే అవకాశం కూడా లేకపోలేదని వైసిపి కీల‌క నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. 

 

Leave a Reply

Your email address will not be published.