గోడ మీద వార్తలు

                                                               17 – 02 – 2020
01 . చంద్రబాబు పీఎస్ ఇంట్లో ఐటీ రైడ్స్ లో 2 వేల కోట్లు దొరికాయన్నది అబద్ధం – దొరికింది సుమారు రెండున్నర లక్షల మాత్రమే – ఐటీ శాఖ …
అంటే – ఆయనకి మల్లే ఈయనక్కూడా వారం లో ఓ రోజు కేటాయించటం కుదరదా..?? ఆంగ్లశుద్ధం … ఇప్పుడెలా…??? 
02. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడమని మా పిల్లలకి నేర్పిస్తాం – నన్ను చంపాలను కుంటే చంపేయండి – అసదుద్దీన్ ఒవైసీ …
ఆ మున్నా సినీమా సీడీని ఎన్నిసార్లు అరగ్గొడతార్రా సామీ – స్క్రిప్టెలాగూ మారదు – డైలాగులన్నా మార్చండెహే…!!
03. పేద ప్రజల దగ్గర నుండి గ్రామ వాలంటీర్లు డబ్బులు వసూల్ చేసి నేతలకి ఇస్తున్నారు – కర్నూలు వైకాపా నేత బాలనాగిరెడ్డి…
ఆళ్ళంతా సొంత మేనమావల్లాంటోళ్ళు సామీ – ఇచ్చిన దాంట్లో ఆ మాత్రం వెనక్కి లాక్కోటంలో తప్పేటుంది చెప్పు..?? 
04. కేంద్రం తెచ్చిన సీఏఏ – ఎన్ఆర్సీ లకి తెదేపా మద్దతు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తాను – తెదేపా నేత కేశినేని నాని …
పనుల్చేయించుకున్న జనాలొదిలేస్తేనే చీమ కుట్టినట్టు లేదెవడికీ – ఇహ తమబోటోళ్ళు ఒగ్గేత్తే గుక్కెట్టేడ్చేదెవడులే సామీ …!! 
05. రాజకీయాలు అవినీతి బురదతో నిండి పోయాయి – వాటిని మనమే శుభ్రం చేయాలి – పవన్ కళ్యాణ్ …
సెల్ఫీలంటే ఎగబడతారు గానీ – క్లీనింగంటే కష్టం బాబాయ్ – అసలే డాలరు కాడ రూపాయి జారిపోటంతో నీతివంతుల ఓటుకి రేటు పెరిగి పోనాది …!!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ” 
:||: జై హింద్ :||:

Leave a Reply

Your email address will not be published.