మంచి స్టార్ అవుతావు నారాయణ.. శతాధిక చిత్రాల హీరో ఆశీస్సులు

దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు తనయుడు హరికృష్ణ ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. అక్షిత కథానాయిక. ఝాన్సీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. జెఎస్ ఆర్ మూవీస్ పతాకంపై సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్నారు. యాజమాన్య సంగీతం అందించారు. అన్ని పనులు పూర్తిచేసుకుని ఈనెల 22న ప్రపంచ వ్యాప్తగా విడుదలవుతుంది.   ఈ హైదరాబాద్ ప్రీరిలీజ్ లో ముఖ్య అతిధిగా విచ్చేసిన శతాధిక చిత్రాల కథానాయకుడు శ్రీకాంత్ తొలి జ్ఞాపికని యాజమన్యకు అందించారు. కాశీ విశ్వనాథ్, మరుధూరి తదితరులు వేడుకలో పాల్గొన్నారు.

శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, “శ్రీనివాసరావు చాలా సంవత్సరాలుగా తెలుసు. తనకి సినమా తప్ప మరో ప్రపంచం తెలియదు. చాలా సినిమాలకు పనిచేసిన అనుభవం  ఉంది. మంచి టెక్నిషీయన్. వాళ్లబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ తనే అన్ని బాధ్యతలు తీసుకుని ఎన్ని కష్టాలు ఎదురైనా ఫ్యాషన్ తోనే శ్రమించాడు. హరి లో మంచి జీల్ ఉంది. సినిమా కోసం తను కూడా చాలా హార్డ్ వర్క్ చేసాడు.  డాన్సులు ఇరగదీసాడు. మంచి స్టార్ అవుతాడన్నా రు.
చిత్ర హీరో  హరికృష్ణ మాట్లాడుతూ, రెగ్యులర్ లవ్ స్టోరీలకు భిన్నంగా ఉంటుంది. ఇదో పెయిన్ ఉనన స్టోరీ. ప్రేమకు కొత్త అర్ధం చెప్పే సినిమా. ప్రేమ అంటే అమ్మాయి అబ్బాయి ఉంటే సరిపోతుందనుకుంటారు. కానీ స్నేహితుడు లేకపోతే ప్రేమ లేదని చెప్పే సినిమ ఇది. స్నేహితుడి విలువను చాటి చెప్పే కథ. క్లైమాక్స్ ఆద్యంత ఆసక్తికరంగా  ఉంటుంది.  దర్శక, నిర్మాతలు తల్లిదండ్రులైనా చాలా ప్రొఫెషనల్ గా వ్వవహరించారు. ఈనెల 22న సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులంతా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నా” అని అన్నారు.

దర్శకుడు జొన్నలగడ్డ  శ్రీనివాసరావు మాట్లాడుతూ, “సీనియర్  ఎన్టీఆర్  నటించిన మేజర్ చంద్ర కాంత్ తో పాటు చాలా సినిమాలకు పని చేసాను. తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించాను. కథను నమ్మి చేసిన సినిమా ఇది. ఈ కథ గురించి కొందరికి చెబితే కొన్ని సలహాలు ఇచ్చారు. కానీ అవేవి నాకు నచ్చలేదు. నేను తీయాలనుకున్నది తీసాను. బాగా వచ్చిందని నమ్ముతున్నాం. హిందీ డబ్బింగ్ రైట్స్ కూ మంచి ధర దక్కింది. అల్లు అరవింద్ గారు సినిమాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఆయన సహకారం ఎప్పటికీ మరువలేనిది. ఈనెల 22న ప్రేక్షకుల మందుకు వస్తున్నాం. తప్పకుండా అదరిస్తారని కోరుకుంటున్నా” అని అన్నారు.

మరుధూరి రాజా మాట్లాడుతూ, “హరిలో మంచి ఫైర్,పెర్పామెన్స్ ఉంది. అంతకు మంచి ఎనెర్జీ లెవల్స్ ఉన్నాయి. మంచి కథతో హీరోగా పరిచయం అవుతున్నాడు. హీరో- ఝాన్సీ పాత్రల మధ్య సవాల్ తో కథ నడుస్తుంది. అక్కడ ఎదురైన ఓ సవాల్ అమ్మాయి ప్రేమకు ఎలా దారితీసిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. రెండు పాత్రలు సినిమాలో బాగా పండుతాయి. ఈ సినిమా కోసం తండ్రీ కొడుకులిద్దరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.