పోలీసుల‌ను ఆశ్ర‌యించిన హీరోయిన్‌, డైరెక్ట‌ర్‌

ఆమ‌ధ్య క‌న్న‌డ న‌టి, ద‌ర్శ‌కుడు ఆంజ‌నేయ‌తో జెండా ఎత్తేసిన వ్య‌వ‌హారం క‌న్న‌డ నాట సంచ‌ల‌నం సృష్టించ‌గా తాజాగా ఈ లవ్ కపుల్ రాయ్‌చూర్ ఎస్పీ ఆఫీస్‌లో ప్రత్యక్షమై.. తామిద్దరం ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నామని, తమకు రక్షణ కల్పించాలంటూ ఆయనకు మొర పెట్టుకోవ‌టంతో వారి ర‌క్ష‌ణ‌కు బ‌రోసా ఇచ్చారు పోలీసులు.  కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకుంటోన్న విజయలక్ష్మీ తన తాజా ఫిల్మ్ ‘తుంగభద్ర’ మూవీ దర్శకుడు ఆంజనేయతో కలిసి పారిపోయింది. దర్శకుడు, హీరోయిన్ మధ్యలోనే వెళ్లిపోవడంతో.. త‌న‌కు వాటిల్లిన న‌ష్టం ఇవ్వాల‌ని నిర్మాత ఆమె కుటుంబ‌స‌భ్యుల‌పై వ‌త్తిడి చేసారు. ఈ క్ర‌మంలోనే ఆమె ప‌లు చిత్రాల‌కు అగ్రిమెంట్లు చేసి అడ్వాన్సులు తీసుకోవటంతో వారూ ఇంటిపైకి రావ‌టంతో విజ‌య‌ల‌క్ష్మి త‌ల్లి ఆందోళ‌న‌తో పోలీసుల‌ను ఆశ్ర‌యించిన విష‌యం విదిత‌మే.
కాగా విజ‌య‌ల‌క్ష్మి క‌న్నా ఆంజ‌నేయ వ‌య‌సు రెట్టింపు అని ద‌ర్శ‌కుడే ఏదో మ‌భ్య‌పెట్టి ఆమెను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్న‌ట్టున్నాడ‌న్న‌ది క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తున్నా మాట‌. మ‌రి ఈ లేచిపోయిన జంట‌… తిరిగి వ‌చ్చి తాజా చిత్రాన్ని కంప్లీట్ చేస్తారా?  లేదా చూడాలి. 
 

Leave a Reply

Your email address will not be published.