‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’

ఒకప్పుడు మళయాళ సెక్సీస్టార్గా వెలుగొందిన షకీల ప్రధానపాత్రధారిణిగా 24 క్రాఫ్ట్స్ బ్యానర్ పై సీవీ రెడ్డి సమర్పణలో సి.హెచ్ వెంకట్ రెడ్డి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథాచిత్రం’. విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణలో సతీష్ వి.ఎన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ చాంబర్లో జరిగింది.
ఈ కార్యక్రమంలో.. నటి షకీల మాట్లాడుతూ – `’ ఇండస్ట్రీలో ఎంతో వల్గారిటీతో వచ్చిన సినిమాలన్నీ విడుదలవుతున్నా, నేను నిర్మించిన ‘లేడీస్ నాట్ అలౌడ్’ సినిమా సెన్సార్ అవడం లేదు. వాళ్లు ఎందుకు అభ్యంతరాలు చెపుతున్నారో అర్థం కావడం లేదు.గత పదినెలలుగా తిరుగుతునే ఉన్నాను. ప్రస్తుతం ట్రిబ్యునల్ లో పిటీషన్ వేసారు. షకీలా అంటే వల్గారిటీ సినిమా అన్న బ్రాండ్‌ని సెన్సార్ వాళ్లు తమ మది నుంచి తీసేయలేదనిపిస్తోంది. , ఏం నటిగా ఫ్యామిలీ సినిమాలు చేయలేనా ? అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించడం కోసమే ఈ కుటుంబ కథాచిత్రం చేస్తున్నాను. ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఇది నేను రాసిన కథ అంటే ఇంకా ఎన్ని ఇబ్బందులు పెడతారో. అని ఆందోళన కూడా ఉందని చెప్పారామె.
చిత్ర దర్శకుడు సతీష్ వి.ఎన్ మాట్లాడుతూ – ‘ అన్ని వర్గాలకు నచ్చే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నాడు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ ‘ షకీలా గత చిత్రం ‘లేడీస్ నాట్ అలౌడ్’కి సహనిర్మాతగా వ్యవహరించానని, ఆ సినిమా పూర్తయ్యి ఏడాది కావలస్తున్న సెన్సార్ కారణంగా విడుదలకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు చేస్తున్న కుటుంబ కథా చిత్రం కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం` అన్నారు.