నాగ్ సరసన కొత్త మలయాళీ భామ?

ప్రస్తుతం టాలీవుడ్లో మలయాళీ భామల హవా సాగుతోంది. మన్మథుడు 2 ఫ్లాప్ తరువాత నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా చిత్ర ప్రీక్వెల్ రూపొందే బంగార్రాజు తెరకెక్కాల్సి ఉన్నా స్క్రిప్ట్ విషయంలో తేడా ప్రరావడంతో ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్టే కనిపిస్తోంది.
అయితే తాజాగా నూతన దర్శకుడు సాల్మన్తో కలిసి నాగ్ తన తదుపరి చిత్రానికి సై అనటంతో స్క్రిప్ట్ పక్కాగా రూపొందించి తెరకెక్కించే పని జరుగుతోందిప్పుడూ. కాగా ఈ చిత్రంలో కథానాయిక పాత్ర చాలా కీలకం కావటంతో ఓ కొత్త అమ్మాయిని తెలుగు తెరకు తీసుకురావాలనుకుంటున్నారట నిర్మాతలు. తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేని కొత్త అమ్మాయితే బాగుంటుందని భావించిన చిత్ర బృందం కొత్త అమ్మాయిని అన్వేషిస్తున్న వీరికి మలయాళీ భామ ఒకరు కాలికి తగిలిందని చిత్రయూనిట్ చెపుతోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.