పెరుగుతున్న విద్యార్ధుల బ్రిటన్‌ వీసాలు!

బ్రిటన్‌కు వెళ్లి చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా ఏటా పెరుగుతోందని  బ్రిటన్‌ జాతీయ గణాంకాల విభాగం తెలియ జేసింది. శుక్ర‌వారం స‌ద‌రు విభాగం ఈ మేర‌కు మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న బ్రిట‌న్ ప‌త్రిక‌ల‌లో ప్ర‌చురిత‌మైంది.  గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది బ్రిటన్‌లో విద్య కోసం భారతీయ విద్యార్థులకు ఇచ్చిన స్టూడెంట్‌ వీసాల సంఖ్యలో 63 శాతం వృద్ధి నమోదయ్యిన‌ట్టు అందులో పేర్కొంది.  ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన సంవత్సరంలో ఇప్ప‌టి వ‌ర‌కు 30,550 మంది భారతీయ విద్యార్థులకు స్టూడెంట్‌ వీసాలు ఇచ్చినట్లు బ్రిటన్‌ ప్రభుత్వం వివరించింది.

Leave a Reply

Your email address will not be published.