ధీటైన హారర్ కామెడీ ..

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమర్షియల్ సక్సస్ ని సాధించిన ఆర్.పి.ఏ క్రియోషన్స్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం-3 గా తెరకెక్కుతున్న చిత్రం ప్రేమకథాచిత్రమ్2 . ఈచిత్రంతో హరి కిషన్ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సుదర్శన్ రెడ్డి నిర్మాత. సుమంత్ అశ్విన్, సిద్ధి ఇజ్ఞాని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నందిత శ్వేత  ప్రధాన నాయిక. షూటింగ్ మొత్తం పూర్తయింది. ఏప్రిల్ 6న ఈ  చిత్రాన్ని విడుదలవుతోంది. సూపర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటి పార్ట్‌కి ధీటుగా వస్తుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సప్తగిరి చేతుల మీదగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు…
డైరెక్టర్ మాట్లాడుతూ… ఈ సినిమా చాలా కష్టపడి తీశాం. ఫస్ట్‌పార్ట్‌కి ఏమాత్రం తీసిపోకుండా దానికి ధీటుగా ఉండేలా చేశాం. అందుకు నిర్మాత పూర్తి సహకారాన్ని అందించారు. ఈ చిత్రంలోని పాటలు కూడా చాలా బాగా కుదిరాయి.  ఇందులోని నటీనటులందరూ చాలా బాగా చేశారు.  టీమ్ అందరం మంచి కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అన్నారు.
నిర్మాత సుదర్శన్ మాట్లాడుతూ… కంటెంట్‌ని నమ్మి ఈ చిత్రం తియ్యడానికి ముందుకొచ్చాను. హరి డెబ్యూ డైరెక్టర్ కానీ చాలా బాగా చిత్రీకరించారు. సాంగ్స్ చాలా బాగా వచ్చాయి. సుమంత్ అశ్విన్ గతంలో చేసిన మూవీస్ కంటే ఈ మూవీ మంచి హిట్‌ని అందిస్తుంది. తన కెరీర్‌కి ఎంతో ఉపయోగపడుతుంది.. అన్నారు. హీరో మాట్లాడుతూ…తాజా పార్ట్‌లో సప్తగిరిగారు లేరని చాలామంది అడిగారు. ఆయనే సీక్వెల్ ట్రైలర్‌ను లాంచ్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది.. అన్నారు.

Leave a Reply

Your email address will not be published.