రికార్డ్ బ్రేకింగ్ రౌడీ బేబి

తమిళ హీరో ధనుష్ , సాయి పల్లవి జంటగా నటించిన ‘మారి 2’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్ ఇటీవల యూ ట్యూబ్ లో విడుదలై తక్కువ టైం లోనే రికార్డు వ్యూస్ ను రాబట్టిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా మరో రికార్డు ను సృష్టించింది. ఇప్పటివరకు సౌత్ నుండి యూ ట్యూబ్ లో హైయెస్ట్ వ్యూస్ ను రాబట్టిన వీడియో సాంగ్ ఇదే. ఈ సాంగ్ ఇప్పటివరకు 183 మిలియన్ల వ్యూస్ ను రాబట్టింది. విచిత్రం ఎమిటంటే సాయి పల్లవి నటించిన ఫిదా లోని వచ్చిందే (182 మిలియన్) అలాగే ధనుష్ కొలవరి సాంగ్ ( 175మిలియన్) రెండు , మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఈ రౌడీ బేబీ సాంగ్ తో ధనుష్ , సాయి పల్లవి వారి రికార్డులను వారే బ్రేక్ చేసుకున్నారు.ఈ సాంగ్ విజయంలో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ కీలకం కాగా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ , యువన్ శంకర్ రాజా కంపోజింగ్ హైలైట్స్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published.