రాజా నువ్వు డ‌బుల్ డిస్కో

`సింధూరం` , `నీకోసం`  చిత్రాల‌తో హీరోగా తొలి అడుగులు వేశాడు ర‌వితేజ‌. కృష్ణ వంశీ కొలీగ్ గా అత‌డు అందుకోని ఎత్తు లేదు. స్టార్ డైరెక్ట‌ర్లు గా కృష్ణ‌వంశీ, పూరి వంటి కొలీగ్స్ ఎదుగుతుంటే, వాళ్ల‌కు స‌మాంత‌రంగా ర‌వితేజ అంచెలంచెలుగా త‌న‌ని తాను స్టార్ హీరోగా ఆవిష్క‌రించుకున్నాడు. ఈ ప‌య‌నం ఎంతో గొప్ప‌ది. రాజా ది గ్రేట్ అనేంత‌గా ఎదిగాడు. ఇండ‌స్ట్రీ బెస్ట్ హీరోల్లో ఒక‌డిగా త‌న‌ని తాను ర‌వితేజ ఆవిష్క‌రించుకున్న తీరు ఎంద‌రికో స్ఫూర్తిమంతం.

ఇటీవ‌ల ర‌వితేజ‌ను వ‌రుస ప‌రాజ‌యాలు ఇబ్బంది పెడుతున్నా మాస్‌లో అత‌డికి ఉన్న క్రేజు ఏమాత్రం త‌గ్గ‌లేదు. ర‌వితేజ‌కు అద్భుత ఫాలోయింగ్ ఉంది. చిన్న పాటి త‌ప్పిదాల్ని క‌రెక్ట్ చేసుకుని అత‌డు తిరిగి ట్రాక్ లోకి వ‌చ‌చేందుకు ఆస్కారం ఉంది. అందుకే ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్‌మెంట్స్ లాంటి ప్ర‌తిష్ఠాత్మ‌క సంస్థ‌లో అత‌డు మ‌రో సినిమా చేయ‌డం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ర‌వితేజ బ‌ర్త్ డే సంద‌ర్భంగా `డిస్కో రాజా` అంటూ టైటిల్ ని ప్ర‌క‌టించారు. ఈ టైటిల్ రాజాకి ప‌ర్ఫెక్ట్ గా యాప్ట్. మాస్ రాజాలోని అద్భుత‌మైన స్వింగుని టైటిల్ ఆవిష్క‌రిస్తోంది. ఎస్.ఆర్.టి బ్యాన‌ర్ లోనే నేల టిక్కెట్టు చిత్రంలో న‌టించిన ర‌వితేజ ఈసారి హిట్ కొట్టాల‌న్న పంతంతో ఉన్నాడు. స‌రైన టైమ్ లో స‌రైన టైమింగ్ తో హిట్ కొట్ట‌డం రాజాకి అల‌వాటు. రాజా ది గ్రేట్ తో అలానే కంబ్యాక్ అయ్యాడు. ఈసారి కూడా అలాంటి కంబ్యాక్ కోస‌మే అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. డిస్కో రాజాతో ఆ విజ‌యం అందుకుంటాడేమో చూడాలి. టైటిల్ బావుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ ని ప్రారంభించ‌నున్నారు. వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published.