టీడీపీకి భారీ షాక్ ఇవ్వనున్న కరణం బలరాంఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత ఇప్పటికే వైసీపీ తీర్థం పుచ్చుకోగా,  చంద్ర‌బాబుకి అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు స‌మాచారం అందుతోంది. ఇప్ప‌టికే  స్థానిక ఎన్నికల నామినేషన్లకు కరణం బలరాం దూరంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న గ‌త కొంత కాలంగా త‌న అనుచ‌రుల‌తో పార్టీ మారే విష‌య‌మై చ‌ర్చలు జ‌రుపుతూ వ‌స్తున్న‌ట్టు సమాచారం. ఇవ్వనున్న 

గత ఎన్నికల్లో  చీరాలకు బలరాం నాన్ లోకల్ అయినప్పటికీ ఆమంచి కృష్ణమోహన్‌పై  గెలిపొంది సంచ‌ల‌న సృష్టించారు. . 4 సార్లు ఎమ్యెల్యేగా ఒక సారి లోక్‌సభకు ఎన్నికయిన బ‌ల‌రాం   ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయాల‌లోకి వ‌చ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన నాటి నుంచి ప‌లు ప‌ద‌వుల‌తో త‌న హ‌వా కొన‌సాగించారు. అయితే కొన్ని నెల‌లుగా గొట్టిపాటితో వ‌చ్చిన విభేదాలు పున‌రావృతం కావ‌టం, దీనిపై చంద్ర‌బాబు నాయుడు నుంచి త‌గిన స్పంద‌న లేని కార‌ణంగా టీడీపీని వీడాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం అందుతోంది. 

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న గురు, శుక్ర‌వారాల‌లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసిపిలో చేరుతార‌ని సన్నిహిత వ‌ర్గాలు చెపుతున్న‌మాట‌. ఏది ఏమైనా ఇన్నాళ్లు ప్ర‌కాశం జిల్లాల‌లో తెలుగుదేశం పార్టీకి బ‌లంగా నిల‌చిన బ‌ల‌రాం పార్టీ వీడటంతో   టీడీపీకి భారీ షాక్ తగలనుందన్న‌ది వాస్త‌వం. 

Leave a Reply

Your email address will not be published.