మేం లంగ‌రెత్తితే… బాల‌య్య కూడా మాతోనే…

త‌మ పార్టీ గేట్లు తెరిస్తే….తెలుగుదేశం పార్టీ శాస‌న‌స‌భ్యులంతా వైసిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యానించారు.  తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వివ‌ల‌వ‌లున్న రాజ‌కీయాలు న‌డుపుతున్న త‌మ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను రెచ్చ‌గొట్టేలా చంద్ర‌బాబు, ఆత‌ని బినామీలు చేస్తున్నార‌ని, ప్ర‌స్తుత ప‌రిస్థితిలో జ‌గ‌న్ క‌నుసైగ చేస్తే… తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వ‌టం ఖాయ‌మ‌ని అన్నారు. 
బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసునుంచీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సహాయంతోనే బయటపడిన విష‌యం గుర్తు చేస్తూ… ఆ కేసును తిరిగి తోడుతామంటే బాల‌కృష్ణ ఇట్టే వైసిపిలోకి రావ‌టం ఖాయ‌మ‌ని అన్నారు.  తెలుగుదేశం ప‌రిస్థితి రోజు రోజుకీ దిగ‌జారుతున్నందునే ఆ పార్టీ నేత‌లు వైసిపిలోకి వ‌చ్చేందుకు సిద్ద‌మ‌వుతున్నార‌ని, రానున్న రోజుల‌లో ఆ పార్టీలో  చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ మాత్రమే చివరకు మిగిలిపోతార‌ని అన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెపుతున్నా… స్వలాభం కోసమే రాద్ధాంతం చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. 

Leave a Reply

Your email address will not be published.