‘నేతన్న నేస్తం’ అందక యువకుడి ఉరి

అనంతపురం జిల్లా సోమందేపల్లి దారుణం చోటుచేసుకుంది . చేనేత కార్మికుల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రవేశపెట్టిన నేతన్న నేస్తం ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే…… సోమందేపల్లి లో చాలా ఏళ్లుగా నేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నీల్లూరి నరసింహులు తనకు నేతన్న నేస్తం 24 వేల రూపాయలు పడలేదని గత మూడు రోజులుగా తనలో తాను మధన పడుతూ మనస్తాపంతో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు అన్ని అర్హతలు ఉన్నా కూడా నేతల నేస్తం రాలేదన్న విషయం అతనిని  ఎంతగానో బాధించిందని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ,తల్లి ఉన్నరు. కుటుంబంలో పెద్దదిక్కు కోల్పోయినందుకు ఆ కుటుంబం తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని తల్లి కోరింది.

Leave a Reply

Your email address will not be published.