‘భీష్మ‘ మూవీ టీం తో మాటామంతి

నితిన్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్శ్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా ‘భీష్మ‘లో నాయికగా నటించిన రష్మిక ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలవుతున్న సందర్భంగా మీడియా ప్రతినిధుల మాటామంతి ఇలా సాగింది.
‘సింగిల్ ఫరెవర్’ అనే ట్యాగ్ లైన్ ఈ సినిమాకి ఎందుకు పెట్టాలనిపించింది ?
లేదు లేదు… ఇది సినిమా ట్యాగ్ కాదు. ఈ మధ్య నితిన్ కి ఎంగేజ్ మెంట్ అయిపోయింది కదా… డైరెక్టర్ వెంకీ, నేను కూర్చొని ఈ సినిమాని మన కోసం చేసుకున్నాం అంటూ సరదాగా అనుకున్నాం అంతే…
భీష్మ సినిమాని చూశారా? ఎలా ఉందనుకుంటున్నారు.?
నేను సినిమాని పూర్తిగా చూడ లేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నా పోర్షన్ మాత్రం చూశాను. అయితే డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్ కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది. వెరీ క్యూట్ ఫిల్మ్ అనిపించింది. ప్రేక్షకులు కూడా కచ్చితంగా అదే ఫీలవుతారు. సాంగ్స్ కూడా బాగా నచ్చాయ్. సినిమా మొత్తం ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది. ఈ సినిమా కోసం మీలాగే నేనూ ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్నాయిగా, వాటితో హడావిడి, అయినా చాలా ఎంజాయ్ చేస్తున్నా.
‘భీష్మ’లో ఎలాంటి రష్మిక ప్రేక్షకులకు కనిపించబోతోంది?
నా సినిమాని నేను జడ్జ్ చెయ్యలేను కానీ వంద శాతం వినోదం అందిస్తానని మాత్రం చెప్పగలను. ఇందులో నేను చేసిన చైత్ర అనే పాత్ర భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటా. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమాతో రష్మిక బాగా నటిస్తుందనీ, బాగా డాన్సులు చేస్తుందనీ, బాగా పాడుతుందని కూడా అందరూ మెచ్చుకోవటం ఖాయం.
అనంత్ నాగ్ లాంటి సీనియర్‌తో కలిసి పనిచెయ్యడం పట్ల మీ ఫీల్ ఏంటి?
అనంత్ నాగ్ గాని కాంబినేషన్ లో నాలుగైదు రోజులు పనిచేశాను. ఆయన నాకు ఫాదర్ ఫిగర్ లాంటివారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచెయ్యడాన్ని బాగా ఆస్వాదించాను. అందునా ఆయనదీ కర్ణాటక కావటంతో ఇద్దరం కలసిపోయాం. ఎప్పుడూ కన్నడలో నా సినిమాలతో సహా నటనపైనా అనేక విషయాలను మాట్లాడుకొనేవాళ్లం.
ఆర్గానిక్ వ్యవసాయం గురించి ఈ సినిమాలో చెప్పరటగా….
అవును అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎలా చెప్తారు. దాన్ని కథగా ఎలా మలచారు అన్నది నన్నీ సినిమాలో చేయమన్నప్పుడు నాకు ఉత్కంఠ రేగింది. అయితే ‘భీష్మ’ దర్శకుడు వెంకీ తన స్క్రీన్ ప్లేతో ఆ టాపిక్ గురించి చాలా బాగా చెప్పాడు. నాకూ ఆసక్తి అనిపించింది. అయితే ఈ ఆర్గానిక్ వ్యవసాయం గురించి ‘భీష్మ’ పుట్టలేదు. ఇది కేవలం ఇందులో ఓ భాగం. ఇందులో ఎక్కడా దాని గురించి లెక్చర్స్ ఉండవని మాత్రం హామీ ఇవ్వగలను.
వ్యవసాయ పరిస్థితులను, యథార్థ ఘటనలను ఈ సబ్జెక్టులో జోప్పించినట్లు టాక్ వినిపిస్తోంది కదా?
మీరు అనుకున్నది నిజం కావచ్చు. ఈ రోజు దేశంలోని రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెతియంది కాదు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్లే కాదు, కనీసం తమ పిల్లలు భవిష్యత్‌లో కష్టాలు పడకుండా ఉండాలని చదివించేందుకు తపన పడే రైతులు ఇప్పుడు స్కూళ్లు ఫీజు చెల్లించడానికి కూడా నానా కష్టాలు పడుతున్న మాట వాస్తవం. వీటిని సూచనప్రాయంగా ఈ కథలో అంతర్లనం చేస్తూ ఆర్గానిక్ వ్యవసాయం సందేశంగా కూడా ఈ సినిమా ఉండబోతోంది. అయితే ఇది ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేసే కామెడీ సినిమా. మరి ఈ రెండింటికీ ఎలా ముడి పడిందో సినిమా చూసి తెలుసుకోండి.
నితిన్ తో పనిచెయ్యడం ఎలా అనిపించింది?
గతంలో నితిన్, సమంతాలు చేసిన ‘అ ఆ’ చూసినప్పుడు నాకు సినిమాలలో ఛాన్సోస్తే ఇలాంటి సినిమా చేయాలని పించింది. నితిన్ తో నటించే అవకాశం వచ్చిన రోజు ఎగిరి గంతేసా. తీఆ సెట్స్ మీదకు వెళ్లినప్పుడు.. నాకన్నా సీనియర్ తనతో చెయ్యడం ఎలా ఉంటుందో అనుకున్నా. కానీ తను ఇప్పటికీ ఒక కాలేజ్ బాయ్ లా కనిపిస్తాడు. షాట్ గ్యాప్‌లో ఫోన్ చూసుకుంటూ, అందరితో నవ్వుతూ మాట్లాడతాడు. ఇది చాలా హ్యాపీ, ఒక్క మాటలో చెప్పాలంటే కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం ఇద్దరం ఈ సినిమా షూటింగ్ అన్నాళ్లూ…
నితిన్ దప లవ్ స్టోరీ గురించి మీకు చెప్పాడా..
లేదండీ, ఈ మధ్య ఆతని నిశ్చితార్ధం జరిగిన రెండ్రోజుల ముందే తన ప్రేమ విషయం నాకు చెప్పాడు. అప్పటిదాకా అలాంటి అంశాలపై నేనూ ఆసక్తి చూపలేదు.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వర్క్ ఎలా ఉంది చెబుతారు?
ర్మాత నాగవంశీ గారు ఈ సినిమా చేసేటప్పుడు నాలుగైదు సార్లు మాత్రమే మాదగ్గరకివచ్చారు. షూటింగ్లో ఇబ్బందులు గురించి అడిగేవారు. చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోయేవారామె. నేనో నిర్మాతని, మీ పరిధి ఇక్కడే అన్న పంథాలో ఆమె నాకు ఎప్పుడూ కనిపించలేదు. .
‘ఛలో’ సినిమాతో కెరీర్ ఆరంభించిన మీరు ఈ మూడేళ్లలోనే వచ్చి స్టార్ డం పై ఎలా ఫీలవుతున్నారు?
నాకు లక్ ఫ్యాక్టర్ ఎంత ఉందో తెలీదు. తెలిసిందల్లా నా దగ్గరకు వచ్చిన దర్శకులు చెప్పే కథ వినటం, మనసుకు నచ్చిన వాటికి సంబంధించిన స్క్రిప్ట్స్ అడగటం ఓ సారి చదువుకుని నా పాత్ర ఎలా చేయాలని చూసుకోవటం అంతే నాకు తెలిసింది.
వేలంటైన్స్ డేని ఎలా జరుపుకున్నారు?
ఈ సారి నా వేలంటైన్స్ డే ఎప్పుడూ లేనంత బోరింగ్‌గా గడిచింది బహుశా. ఎవరూ ఎప్పుడూ అలాంటి బోరింగ్ వేలంటైన్స్ డేని గడిపి ఉండరు. ఇందుకు ప్రధాన కారణం ఆరోజు నాకున్న పనులన్నీ కేన్సిల్ కావటంతో ఇంట్లో ఒంటరిగా బోర్… బోర్… తలచుకుంటేనే భయమేస్తోంది.
పాత్రల ఎంపికలో మీరు ప్రయోగాలు చేస్తున్నట్టున్నారే…
అవును అది ప్రయోగమే అనుకోండి… కొత్త దనం అనుకోండి… కానీ నటిగా నాకు సంతృప్తి అందాలి కదా? అందుకే కథకు ప్రాధాన్యమున్న పాత్రల్ని, మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటున్నా. ఓ విధంగా రొటీన్‌కి భిన్నంగా నా కెరీర్‌తో నేను ప్రయోగాలు చెయ్యడమే. అందుకే ఉత్కంఠ కలిగించే సబ్జెక్టులు ఎంచుకుంటున్నా.
మీరు సినిమాల విషయంలో ఎమోషన్ ఫీల్ అవుతున్నట్టున్నారే…
అది ఎమోషనల్ కావచ్చు, మరొకటి కావచ్చు. లేదంటే వాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేటట్లు ఉండాలి. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందాలి.. కడుపు నొప్పి పుట్టేంతగా వాళ్లు నవ్వాలి. నేను కూడా ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పేప్పుడు నవ్వలేక పొట్టచేత్తో పట్టుకున్నా.
అప్పట్టు అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమా చేస్తున్నారుగా.. ఎప్పుడు జాయిన్ అవుతున్నారు?
అవునండి. బన్నీతో ఈ మార్చి లో చేయాల్సిన సినిమా ఉంది. ఈ నెల మధ్యలో జాయినవుతాను. అందులో మరో తరహా రష్మికను మీరు చూస్తారు అని మాత్రం చెప్తా..