మ‌హేష్ సినిమాకి జ‌గ‌న్ చేయూత‌


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన కొత్త చిత్రం సరిలేరు నీకెవ్వరూ. ఈ సినిమా జనవరి 11 వ తేదీన రిలీజ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటీకే  ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరక్కించిన ఈ సినిమాకు ప్రస్తుతం పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఎప్పుడైన సంక్రాంతికి వచ్చిన ఎంటర్టైన్మెంట్ సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తాయి.ఇప్పటికే సరిలేరు నీకెవ్వరూ సినిమా ట్రైలర్, టీజర్, సాంగ్స్ తో మంచి రెస్పాన్స్ క్రియేట్ చేసుకుంది. దీంతో అభిమానుల్లో, అటూ టాలీవుడ్ లోనూ అంచనాలను అమాతం పెంచేసింది.

ఈ నేపథ్యంలో రిలీజ్ కు ముందు రోజు అంటే అర్ధరాత్రి స్పెషల్ షోల కోసం అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు నిర్మాత అనిల్ సుంకర ఈ లేఖను పరిశీలించిన ప్రభుత్వం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.  ఈనెల 11 నుంచి 17 వ తేదీ వరకు అదనంగా రెండు షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  అంటే రోజుకు నాలుగు షోలు ఉంటే..ఇప్పుడు ఆరు షోలు వేసుకోవచ్చు అన్నమాట.  దీంతో ఏపీలో ఆరు షోలు వేసుకోవడం కోసం థియేటర్లు రెడీ ముస్తాబవుతున్నాయి

Leave a Reply

Your email address will not be published.