మరో బాషాని తలపించేలా!

నయనతార టైటిల్ పాత్రలో ఆర్.అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్  ‘ఇమైక్కానోడిగల్’. ఈ చిత్రాన్ని సి.జె.జయకుమార్ సమర్పణలో  విశ్వశాంతి పిక్చర్స్ బ్యాన్ప సి.హెచ్.రాంబాబు, ఆచంట గోపీనాథ్ తెలుగులో ౠఅంజలి సిబిఐౠ పేరుతో ఫిబ్రవరి 22న విడుదల చేస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది. ఆడియో సీడీలను ‘గృహం’ ఫేమ్ మిలింద్ రావ్ విడుదల చేయగా, తొలి సీడీని తుమ్మల ప్రసన్నకుమార్ అందుకున్నారు.
అమ్మిరాజు మాట్లాడుతూ – ఈవీవీ, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గోపీనాథ్ జంబ లకిడి పంబ సినిమాకు కలిసి పనిచేశారు. అప్పట్లో నేను ఆ సినిమాకు మేనేజర్‌గా పనిచేశాను. ఇన్నేళ్ల తర్వాత ఆయనతో మళ్లీ వేదికను పంచుకోవడం ఆనందంగా ఉంది. తమిళంలో లా తెలుగులో  సక్సెసవ్వాలి” అన్నారు.
నిర్మాత సి.హెచ్.రాంబాబు మాట్లాడుతూ – ‘ఇమైక్కా నొడిగల్’ సినిమా చూశాను. చూడగానే నచ్చింది. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఫ్యాన్సీ రేటుతో తెలుగు హక్కులను దక్కించుకున్నాం” అన్నారు. దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించడానికి 2 సంవత్సరాల సమయం పట్టింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత ఆ కష్టమంతా మరచిపోయే పెద్ద హిట్ అయ్యింది. గోపీనాథ్గారు ఈ సినిమా కోసం నన్ను ఎప్పటి నుండో ఫాలో అప్ చేస్తున్నారు. తమిళంలో సినిమా చూసి అభినందించిన ఆయనే తెలుగులో హక్కులు కొని విడుదల చేయడం ఆనందంగా ఉంది. శ్రీరామకృష్ణగారు అద్భుతంగా సినిమాను తెలుగులో చక్కగా రాశారు. తమిళంలో ఘన విజయం సాధించిన తీరుగానే తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.