వారు ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులే…

నటుడు పోసాని కృష్ణమురళి వర్సెస్ ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ మధ్య మాటల యుద్ధం రాజుకుంటుంది. పోసాని విమర్శలకు పృథ్వీ కౌంటర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రైతుల వద్ద భూములు లాక్కున్నప్పుడు ఎందుకు స్పందించలేదన్నారు. క్షమాపణ చెప్పను అంటే..చెప్పను అని పృథ్వీ చెప్పారు. పార్టీ స్టాండ్ ప్రకారమే మాట్లాడాను..ఎవరో మాట్లాడితే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని ఆయన తెల్చిచెప్పారు. దమ్ముంటే పోసానికి ఏదైన వేదికపైకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. వ్యవసాయం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిసులని అనలేదని ఆయన అన్నారు. అమరావతిలో ఆందోళనలు చేస్తున్నవారు ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులే. నాతో పాటు నటించినవారు కూడా అమరావతి ఆందోళనల్లో ఉన్నారు’ అని చెప్పారు.