నాకు సిగ్గు బాబూ..

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే .. అంటూ ప్రేయసి కోసం ప్రియుడు ఎంతగా మదనపడ్డాడో తెరపై చూశాం. గీత గోవిందం చిత్రంలోని ఈ పాట వింటే అందాల రష్మికనే గుర్తుకు వస్తుంది. రష్మిక ను ఇమ్మిటేట్ చేస్తూ డబ్ స్మాష్ లు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. అదంతా సరే.. ఓ 4 ఏళ్ల చిన్నారి బాలుడు రష్మికపై మనసుపడడమే కాదు .. తనే కావాలని మారాం చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏదో ఫోటో దిగడానికి కాదు.. ఏకంగా పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు ఆ బుడతడు. నీ కన్నా పెద్దది కదా.. అని అడిగితే… అదేం తెలియదు నాకు రష్మిక కావాలని మారాం చేస్తున్నాడు. ఈ విషయం రష్మికకు తెలిసిపోయింది.. ఈ బుల్లి పెళ్లి కొడుకుని చూశాక.. నాకు సిగ్గు బాబు అనేస్తోంది.
ప్రవీణ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఈ బుల్లి పెళ్లి కొడుకుని వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ బుడ్డోడి పేరు ప్రతి. ఎవరిని పెళ్లి చేసుకుంటావ్? అని అడిగితే నేను రష్మికనే చేసుకుంటానని అంటున్నాడు. ఇంతకీ రష్మిక ఎవరు అని అడిగితే.. అదంతా నాకు తెలియదు.. హీరోయిన్.. ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే సాంగ్‌లో వస్తుంది కదా ఆ అమ్మాయే అంటూ మారాం చేస్తున్నాడు. రష్మికను వేరే ఎవరైనా పెళ్లి చేసుకుంటానంటే.. కొట్టేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published.