నేటి నుంచి ‘ఎస్‌బీఐ’ కొత్త వడ్డీ రేట్లు

భారత దేశ దిగ్గజ బ్యాంక్ అయిన.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన ఖాతాదారుల కోసం ఇటీవలే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వడ్డీ రేట్లు నేటి నుంచి ఎస్‌బీఐ అమలులోకి తీసుకువచ్చింది. టర్మ్ డిపాజిట్లపై 10 నుంచి 50 బేసిస్ పాయింట్స్, బల్క్ సెగ్మెంట్‌లో 25 నుంచి 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లను తగ్గించింది. 7 రోజుల నుంచి 45 రోజుల కాలవ్యవధిని మినహాయించి అన్ని కాలవ్యవధులపై ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తగ్గించింది బ్యాంకు. 46 రోజుల నుంచి 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఏకంగా అరశాతం వడ్డీ రేటు తగ్గింది. దీంతో ఇప్పట్నుంచి 5 శాతం వడ్డీ లభిస్తుంది. ఇక 180 నుంచి 210 రోజులు, 211 నుంచి ఏడాది లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ లభిస్తుంది. గతంలో ఈ వడ్డీ 5.80 శాతంగా ఉండేది. ఏడాది నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై 10 బేసిస్ పాయింట్స్ వడ్డీ తగ్గించింది.

7 రోజుల నుంచి 45 రోజులు- 4.50%
46 రోజుల నుంచి 179 రోజులు- 5.00%
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 6.00%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 6.00%3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 6.00%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.00%

సీనియర్ సిటిజన్లకు కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. ఆ వివరాలు క్రింద చూడవచ్చు

7 రోజుల నుంచి 45 రోజులు- 5.00%
46 రోజుల నుంచి 179 రోజులు- 5.50%
180 రోజుల నుంచి 210 రోజులు- 6.00%
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 6.00%
1 ఏడాది నుంచి 2 ఏళ్లు- 6.50%
2 ఏళ్ల నుంచి 3 ఏళ్లు- 6.50%
3 ఏళ్ల నుంచి 5 ఏళ్లు- 6.50%
5 ఏళ్ల నుంచి 10 ఏళ్లు- 6.50%
180 రోజుల నుంచి 210 రోజులు- 5.50%
211 రోజుల నుంచి 1 ఏడాది లోపు- 5.50%

Leave a Reply

Your email address will not be published.