అల‌వైకుంఠ‌పుర‌ములో అభిమానుల కోలాహ‌లంత్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం `అల‌వైకుంఠ‌పురంలో` పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే విడుద‌లైన సాంగ్స్‌, టీజ‌ర్‌, ట్రైలర్లు మంచి వ్యూస్ తో సోష‌ల్ మీడియాలో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం  మ్యూజిక్ కన్సర్ట్ ఈరోజు యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతున్న విషయం తెలిసిందే.

ఇక అక్క‌డ‌కు విచ్చేసిన అభిమానుల కోలాహ‌లం మాములుగాలేదు. బ‌న్నీ ఎంట్రీ ఇవ్వ‌గానే ఒక్క‌సారిగా ఫ్యాన్స్ అంద‌రూ స‌ముద్రంలోని అలలాగా  బ‌న్నీ వద్ద‌కు సెల్ఫీల కోసం విరుచుకుప‌డ్డారు. ఇక బ‌న్నీ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌వాల్సిన అవ‌స‌రం లేదు. టీజ‌ర్ పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఈ సినిమా క్రేజ్ అమాంతం పెరిగిపోయింద‌నే చెప్పాలి. అభిమానుల అంచ‌నాల‌కు హ‌ద్దులేనంత క్రేజ్ వ‌చ్చేసింది. త్రివిక్ర‌మ్ సినిమాల‌కు కాపీ కొడ‌తాడ‌నే విమ‌ర్శ‌లు ఉన్న‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు హిట్ కొడుతూనే వ‌చ్చారు.

మాములుగా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అంటే కాస్త హ‌డావిడి ఎక్కువ‌గానే చేస్తారు. అందులోనూ స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ ఫ్యాన్స్ అంటే ఇక ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆ హ‌డావిడి ఆ సంద‌డే అస‌లు వేర‌యా అన్న‌ట్లు ఉంది ఈవెంట్ అంతా ఫ్యాన్స్ గోల‌తో హోరెత్తిపోతుంది. అల్లుఅర్జున్‌కి మాములు ప్ర‌జ‌లేకాక ఇక్క‌డ‌కు విచ్చేసిన సింగ‌ర్స్‌ అంద‌రూ కూడా  ప్ర‌త్యేకంగా బన్నీకి ఫ్యాన్స్ అని చెపుతూ అంద‌రూ ప్ర‌త్యేక‌ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. 

Leave a Reply

Your email address will not be published.