ఉద్యోగ‌మేదైతేనేం…? శానిట‌రీ కార్మికుల పోస్టుకు ఇంజ‌నీర్లు సైతం ర‌డీ

ఇప్పుడు ప్ర‌భుత్వ ఉద్యోగం దొరికితే చాలు… అందులో మ‌న చ‌దువుకు సంబంధించిన ప‌ని ఉందా లేదా అన్న‌ది క‌నీసం   నిరుద్యోగులు చూడట్లేదన్న‌ది వాస్త‌వం. ఇక తెలుగు రాష్ట్రాల‌లో ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చి చాలా రోజులు కావ‌టంతో  నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు అప్లికేషన్లే అప్లికేషన్స్ పెట్టి ప‌డేస్తున్నారు. కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క జాబ్ కోసం వేల మంది నిరుద్యోగులు పోటీ పడిన సంద‌ర్భాలు చాలానే   ఉన్నాయంటే ఈ దేశంలో నిరుద్యోగం ఎంత‌గా పెరిగి పోయింతో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అంతెందుకు  తమిళనాడు, కోయంబత్తూరు నగర కార్పొరేషన్‌లో శానిటరీ కార్మికుల పోస్టులు భర్తీ చేయాల‌ని నిర్ణ‌యించి నియామ‌కాల కోసం ఓ ప్రకటన విడుద‌ల చేసింది. ఈ  ఉద్యోగాలకు 10వ తరగతి కనీస విద్యార్హత కాగా ప్రారంభ జీతం రూ .15,700గా నిర్ణ‌యించారు. కార్పొరేషన్‌లో మొత్తం 549 శానిటరీ కార్మికుల పోస్టులకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు.

దీంతో ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు.. వేలకొద్దీ నిరుద్యోగులు ఈ పోస్టుల కోసం ఎగబడ్డారు.  ఇప్ప‌టికి 7 వేల మంది ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు దరఖాస్తు చేసుకోవ‌టంపై   అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన పలువురు ఉద్యోగార్థులను మీడియా పలకరించగా.. ప్రతిదీ ఒక వృత్తి కాబట్టి శానిటరీ వర్కర్‌గా పనిచేయడంలో పెద్దగా సిగ్గు లేదనీ చెప్పుకొవ‌టం విశేషం.

Leave a Reply

Your email address will not be published.