అడల్ట్ హార్రర్ కామెడీ గా వస్తోన్న చీకటి గదిలో చితకొట్టుడు ట్రైలర్ విడుదల..!!

ఆదిత్ హీరోగా నిక్కీ తంబోలి హీరోయిన్ గా బ్లూ గోస్ట్ పిక్చర్స్ పతాకంపై పి.సంతోష్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం చీకటి గదిలో చితకొట్టుడు. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో ఆధిత్, హీరోయిన్ నిక్కి తంబోలి, తాగుబోతు రమేష్, మిర్చి హేమంత్, దర్శకుడు సంతోష్ పి.జయకుమార్, సంగీత దర్శకుడు బాలమురలి బాలు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ తమిళంలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన  ఐ ఎం కె చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. పోసాని, రఘుబాబు, సత్యం రాజేష్, తాగుబోతు రమేష్, మిర్చి హేమంత్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి మూడో వారంలో విడుదలకు సిద్ధం అవుతోంది.
హీరో ఆధిత్ మాట్లాడుతూ… లాస్ట్ టైం ఎల్7 హార్రర్ ఫిలిం చేసాను…అది సరిగ్గా ఆడలేదు. ఈ సారి హార్రర్ ఫిలిం చేస్తే మంచి సినిమా చెయ్యాలి అని చూస్తున్న టైం లో ఈ సినిమా గురించి  సంతోష్ చెప్పాడు. స్క్రిప్ట్ విని చాలా ఎక్సయిట్ అయ్యాను. షూటింగ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తూ చేశాం. ఇలాంటి సినిమాల్ని అందరూ హ్యాండిల్ చేయలేరు. సంతోష్ బ్యాలెన్స్ గా తెరకెక్కించాడు. యూత్, కపుల్స్, సింగిల్ పర్సన్స్ ఎంజాయ్ చేసేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. సినిమా అదిరిపోయింది. కడుపుబ్బా నవ్వుకొనేలా సినిమా  వుంతుంది..అన్నారు.
హీరోయిన్ నిక్కి తంబోలి మాట్లాడుతూ… ఈ చిత్రంలో ఫస్ట్ టైం గ్లామరస్ రోల్ ప్లే చేసాను. చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ కలిగించింది. అడల్ట్ హార్రర్ కామెడీ ఫిల్మ్ ని డైరెక్టర్ సంతోష్ ఛాలెంజింగ్ గా తీసుకొని చేశారు. ట్రైలర్ అమేజింగ్ గా ఉంది. హీరో అదిత్ చాలా సపోర్ట్ చేసాడు. ఈ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను.. అన్నారు.

దర్శకుడు సంతోష్ పి. జయకుమార్ మాట్లాడుతూ… ఇది నా మూడవ చిత్రం. తమిళంలో లాస్ట్ ఇయర్ ఐ ఎం కె గా ఈ చిత్రం విడుదలై కాంట్రవర్సీ అయి పెద్ద హిట్ అయ్యింది. హిందీలో ఇలాంటి చిత్రాలు చాలా వచ్చాయి. తమిళ్, తెలుగులో మొదటిసారి వస్తోంది. అడల్ట్ హార్రర్ కామెడీ చిత్రం ఇది. అబ్బాయి, అమ్మాయి, యూత్ మాత్రమే ఈ సినిమా చూడాలి. బ్యాంకాక్ లో 14 రోజులు, చెన్నైలో 6రోజులు మొత్తం 20రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. ఆర్టిస్టులు అందరూ ఫుల్ సపోర్ట్ చేయబట్టే త్వరగా పూర్తి చేశాం. న్యూ జోనర్ లో ఈ సినిమాని ట్రై చేశాం. కచ్చితంగా సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్వుకునేలా ఈచిత్రం ఉంటుంది అన్నారు. 18 సంవత్సరాల పైబడినవారు ఈ సినిమా చూడాలి. ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాకి రావద్దు.. అన్నారు.

Leave a Reply

Your email address will not be published.