మెగాస్టార్ మార్చిలోనే ముహూర్తం?

మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ వ‌ర్క్ గురించి తెలిసిందే. బ్ల‌డ్ బ్యాంక్, ఐబ్యాంక్ వంటి కీల‌క‌మైన ఆర్గ‌నైజేష‌న్స్ ని ర‌న్ చేస్తూ దేశంలోనే ఎంతో గొప్ప హృద‌యం ఉన్న క‌థానాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. ఓవైపు రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక ప్ర‌త్య‌ర్థులు త‌న స్వ‌చ్ఛంద సేవ‌ల‌పై బుర‌ద జ‌ల్లుతూ ఉన్నా.. వాట‌న్నిటినీ ఎంతో ఓపిగ్గానే భ‌రించారు చిరంజీవి. అయితే ఎవ‌రు ఎలాంటి బుర‌ద జ‌ల్లినా త‌న ప‌ని తాను స‌వ్యంగా చేస్తూనే వెళుతున్నారు మెగాస్టార్. ఆయ‌న చేసే సామాజిక సేవ‌ల‌కు అభిమానులు సైతం అండ‌గానే  నిలుస్తున్నారు.
నేడు రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి హైద‌రాబాద్ బ్ల‌డ్ బ్యాంక్ వ‌ద్ద జండావంద‌నం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీగా అభిమానులు త‌రలి వ‌చ్చారు. ఇక ప్ర‌తియేటా మెగాస్టార్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానులు బ్ల‌డ్ డొనేష‌న్ కార్య‌క్ర‌మాల‌తో సంద‌డి చేస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న `సైరా-న‌ర‌సింహారెడ్డి` బ్లాక్ బ‌స్ట‌ర్ కావాల‌ని ఇప్ప‌టినుంచే అభిమానులు పూజ‌లు పున‌స్కారాలు చేస్తున్నార‌ట‌. చిరు కెరీర్ 150వ సినిమా `ఖైదీనంబ‌ర్ 150`  రిలీజ్ ముందు ఇలానే అభిమానులు భారీగా ముక్కోటి దేవ‌త‌ల‌కు పూజ‌లు చేశారు. త‌దుప‌రి కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో 152వ సినిమాలోనూ చిరు న‌టించ‌నున్నారు. ఈ చిత్రానికి క‌థానాయిక‌లుగా న‌య‌న‌తార‌, త‌మ‌న్నాల‌ను ఫైన‌ల్ చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే త‌మ‌న్నా ఓకే చెప్పిందిట‌. న‌య‌న్ షెడ్యూల్స్ చూసుకుని ఓకే చేయాల్సి ఉంది. మ‌రోవైపు బాలీవుడ్ భామ‌ల కోసం నిర్మాత చ‌ర‌ణ్ సెర్చ్ చేస్తున్నార‌ట‌. మార్చిలో సినిమాని ప్రారంభించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published.