మాస్క్ లతో పరీక్షలకు వెళ్లొచ్చు

పరీక్ష కేంద్రాల్లో ఫేస్ మాస్క్ లు, శానిటేషన్ వస్తువులు ధరించి వస్తే అనుమతించాలని రాష్ట్రాల విద్యా శాఖలకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సూచించింది. పరీక్షల సీజన్‌తో పాటు దేశంలో కరోనా కేసులు విస్తరిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని తెలిపింది. అలాగే కరోనా విషయంలో కరోనా విషయంపై కఠినంగా వ్యవహరించాలని, ప్రజలలో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలంటూ, కేంద్ర ప్రభుత్వం దేశంలోని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఓ లేఖ పంపిస్తూ కరోనా పై జనంలో అవగాహన పెంచాలని, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాల ప్రధానకార్యదర్శులకు పేర్కొంది.
ప్రధానంగా పరీక్షల సీజన్సమీపించినందున పాఠశాలల్లో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కేంద్ర మానవవనరుల శాఖ కార్యదర్శి అమిత్ ఖరే రాష్ట్రాల సీఎస్ లకు రాసిన లేఖ లో పేర్కొన్నారు. స్కూళ్లలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఆరోగ్యం సరిగాలేని పిల్లలను స్కూళ్లకు దూరంగా ఇళ్ల వద్దే ఉండేలా చూడాలని సూచించారు. అలాగే బహిరంగ ప్రదేశాలలోకి, రద్దీగా ఉండే ప్రాంతాలలోకి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకునేలా తల్లిదండ్రులకు సూచించాలని, ఈ మేరకు ఉపాధ్యాయులు వారికి అవగాహన కలిగించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది.