`అందాల రాక్ష‌సి` ఇంటి పై ఐటీ దాడులు…?లావణ్య త్రిపాఠి…’అందాల రాక్షసి’గా తెలుగు ఇండ్రస్ట్రీలో అడుగుపెట్టి..ఎందరో కుర్రాళ్ల హృదయాలు కొల్గగొట్టింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో తన నటనతో, అందంతో అదరగొట్టింది. చివరగా మెగాప్రిన్స్ వరణ్ తేజ్‌తో అంతరిక్షంలో మెరిసింది. ప్రస్తుతం కుర్రహీరో నిఖిల్ సరసన ‘అర్జున్ సురవరం’ చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఇటీవ‌లె విడుద‌లై ఘ‌న విజయం సాధించింది.

ఇక ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్‌లోని లావణ్య త్రిపాఠి ఇంటి పై డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ (డీజీజీఐ) అధికారుల దాడులు చేశారు. ఇంకా  సోదాలు కొన‌సాగుతున్నాయి.  సినిమా షూటింగ్ లో ఉన్న లావ‌ణ్య విష‌యం తెలుసుకుని షూటింగ్‌ను పోస్ట్ పోన్ చేసుకుని ఇంటికి చేరుకుంది.

ఈ ఐటీ దాడులు నగరంలోని మొత్తం 23 ప్రాంతాల్లో  డీజీజీఐ టీమ్స్ నిర్వ‌హించారు. చిట్‌ఫండ్‌ కంపెనీలు, కోల్డ్‌ స్టోరేజ్‌ యూనిట్లు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలతో పాటు ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీల్లోనూ ఉదయం నుంచి డీజీజీఐ సోదాల్లో కోట్ల రూపాయ‌ల్లో సర్వీస్‌ట్యాక్స్, జీఎస్టీ ఎగవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఇక ఇటీవ‌లె విడుద‌లైన నిఖిల్ చిత్రం `అర్జున్‌సుర‌వరం` ప‌ర్వాలేద‌నిపించుకుంది. ప్రస్తుతం లావణ్య చేతిలో కూడా సినిమాలు లేవు, అర్జున్ సురవరం హిట్ అయితేనే ఆమె కెరీర్ లో ఏదైనా మార్పు రావొచ్చు

Leave a Reply

Your email address will not be published.