బాలయ్య సరసన జబర్ధస్త్ భామ రష్మీ

నటసింహా నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్ వస్తున్న సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనునున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ఇప్పటికే కీర్తి సురేష్ ని ఎంపిక చేసినట్టు వినిపిస్తోంది. మరో నాయిక గా జబర్దస్థ్ హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ఎంపికైనట్టు సమాచారం.
ఇటీవలే బోయపాటి రష్మీని కలిసి పాత్ర గురించి వివరించి ఒప్పించినట్లు ఫిలింనగర్ టాక్. గ్లామర్ తో పాటు పాత్ర పరంగానూ మరింత క్రేజ్ తీసుకొస్తుందని బోయపాటి చెప్పడంతో రష్మి అంగీకరించినట్టు వినవస్తోంది.
ఇప్పటికే రష్మీ గుంటూరు టాకీస్ సహా పలు సినిమాలతో కథానాయికగా తనని తాను నిరూపించుకుంది. అయితే ట్రాక్ సరైన గాడీలో పడేందుకు తగిన ఎనర్జీ ఉన్న పాత్ర ఏదీ లభించడం లేదన్నబాధ ఆమెలో ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్య సరసన నటించే ఛాన్స్ పై వస్తున్న కథనాలు వాస్తవమే అయితే అది ఖచ్చితంగా రష్మీకి కలిసొచ్చే అంశమే.